News May 22, 2024

దేశంలో కరోనా కొత్త వేరియంట్

image

దేశంలో మరోసారి కరోనా కలకలం రేగింది. దేశంలో కేపీ-1 కేసులు 34, కేపీ-2 వేరియంట్ కేసులు 290 నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 148, ప.బెంగాల్‌లో 36, గుజరాత్‌లో 23 కేసులు నమోదైనట్లు పేర్కొంది. కానీ ఈ వేరియంట్‌తో ఇబ్బంది లేదని వెల్లడించింది. ఇటీవల <<13273520>>సింగపూర్‌లో <<>>ఈ తరహా కరోనా కేసులు 10 రోజుల్లోనే 25వేలకు పైగా నమోదవడం తెలిసిందే.

Similar News

News December 5, 2025

జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>జూలాజికల్ <<>>సర్వే ఆఫ్ ఇండియా 9 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 18 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc(జువాలజీ/వైల్డ్ లైఫ్ సైన్స్/ఎకాలజీ/లైఫ్ సైన్సెస్/ఆంథ్రోపాలజీ), PhD, MA(ఆంథ్రోపాలజీ/సోషల్ సైన్సెస్/హిస్టరీ/ఎకనామిక్స్/ఫిలాసఫీ ఉత్తీర్ణులు అర్హులు. Sr ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.57వేలు+HRA, ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.35వేలు+HRA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://zsi.gov.in

News December 5, 2025

నటుడు క్యారీ-హిరోయుకి తగావా కన్నుమూత

image

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా(75) కన్నుమూశారు. స్ట్రోక్ సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జపాన్‌లో జన్మించిన ఆయన అమెరికన్, రష్యన్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు. మోర్టల్ కోంబాట్, ది లాస్ట్ ఎంపరర్, లైసెన్స్ టు కిల్, ది మ్యాన్ ఇన్ ది హై కాజిల్, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి సినిమాలు, సిరీస్‌లతో పాపులర్ అయ్యారు. విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపించారు.

News December 5, 2025

స్క్రబ్ టైఫస్ వ్యాధిని ఈ లక్షణాలతో గుర్తించండి

image

AP: స్క్రబ్ టైఫస్‌ను వ్యాప్తి చేసే చిగ్గర్ పురుగు మనిషిని కుట్టినచోట నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. తర్వాత తీవ్రమైన జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. తలనొప్పి, అలసట, వాంతులు, విరేచనాలు లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపి రోగి క్రమంగా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది అంటువ్యాధి కాదని వైద్యులు తెలిపారు.