News October 30, 2025
ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ సౌకర్యాలు.. తొలుత కొడంగల్‌లో

TG: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా వసతులు కల్పించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకోనుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొడంగల్‌లో చేపట్టనున్నారు. స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్‌లు, ఇంటర్నెట్, లైబ్రరీలు, క్రీడా మైదానాలు వంటివి ఏర్పాటు చేస్తారు. టీచర్లు, స్టూడెంట్స్‌కు ID కార్డులు, 8-10th స్టూడెంట్స్‌కు IIT, NEET ఫౌండేషన్ మెటీరియల్ అందిస్తారు.
Similar News
News February 13, 2026
శివ నామాలు అర్థాలు ‘‘అర్ధనారీశ్వర’’

ప్రకృతి, పురుషుడు వేరు కాదని చాటిచెప్పే అద్భుత రూపమిది. లోక కల్యాణం కోసం శివుడు తన శరీరంలో సగభాగాన్ని పార్వతీ దేవికి ఇచ్చి ‘అర్ధనారీశ్వరుడు’ అయ్యాడు. కుడిభాగం శివుడు(పురుష తత్త్వం), ఎడమభాగం పార్వతి(స్త్రీ తత్త్వం). సృష్టిలో స్త్రీపురుషులు సమానమని, ఒకరిలో ఒకరు ఇమిడి ఉన్నారని ఈ రూపం తెలియజేస్తుంది. శక్తి లేనిదే శివుడు లేడు. శివుడు లేనిదే శక్తి లేదు అనే పరమ సత్యాన్ని ఈ రూపం ద్వారా మనం గ్రహించవచ్చు.
News February 13, 2026
607 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(NLCIL) 607 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ అర్హత గల వారు ఫిబ్రవరి 25వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల కనీస వయసు 18 ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు స్టైపెండ్ రూ.11,040 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nlcindia.in
News February 13, 2026
వేసవి బీర సాగు.. ఇలా చేస్తే మేలు

తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడినిచ్చే పంట బీర. ఎన్.ఎస్-3, ఎన్.ఎస్-40, సురేఖ, జగిత్యాల లాంగ్, జైపూర్ లాంగ్ రకాలతో అధిక దిగుబడి పొందవచ్చంటున్నారు నిపుణులు. ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల కంటే తక్కువ ఉంటే బీరలో పూత, పిందె రాలే అవకాశం ఎక్కువ. 36 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే మగ పువ్వులు ఎక్కువగా వచ్చి దిగుబడి తగ్గుతుంది. అందుకే వేసవి బీర సాగును హరిత పందిర్లు కింద చేపడితే అధిక దిగుబడి వస్తుందంటున్నారు నిపుణులు.


