News September 5, 2025

ఈ స్కిల్స్ ఉంటేనే కార్పొరేట్ జాబ్స్(1/2)

image

కార్పొరేట్ రంగంలో పోటీని తట్టుకుని నిలబడాలంటే టెక్నికల్ స్కిల్స్‌‌తోపాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా అవసరం. నిత్యం అప్​గ్రేడ్ అవుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆఫీస్​ వర్క్​ కల్చర్‌లో మార్పులను అర్థం చేసుకుని, నేర్చుకుని ముందుకెళ్లాలి. ఈ రంగంలో రాణించాలంటే క్రిటికల్‌ థింకింగ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, క్రియేటివిటీ, కొలాబరేషన్ లాంటి నాలుగు ‘C’లు అవసరమని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News September 7, 2025

ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేశ్

image

AP: కర్ణాటకలోని ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని మంత్రి లోకేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా కాలభైరవేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి మఠం సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆదిచుంచనగిరి మఠం నిర్వహించే సంవిత్ పాఠశాలలను పరిశీలించారు. APలో పేదల కోసం సంవిత్ బడులు ప్రారంభించాలని కోరగా, పీఠాధిపతి జగద్గురు శ్రీనిర్మలానందనాథ మహాస్వామిజీ అంగీకారం తెలిపారు.

News September 7, 2025

ఉపరాష్ట్రపతి ఎన్నిక..‘ఇండీ’ ఎంపీలకు మాక్ పోలింగ్

image

ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న క్రమంలో రేపు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఇండీ కూటమి ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎంపీ మల్లు రవి తెలిపారు. గత ఎన్నికల్లో 15 మంది ఎంపీలు సరిగ్గా ఓటు హక్కు వినియోగించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడం ఎంపీల బాధ్యత అని, ఈ ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని సూచించారు.

News September 7, 2025

రూ.50 లక్షలకు కేజీ డ్రగ్స్.. సంచలన విషయాలు వెలుగులోకి

image

TG: డ్రగ్స్ తయారీ యూనిట్ <<17630840>>కేసులో<<>> సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ డ్రగ్స్‌ను కేజీ రూ.50 లక్షల చొప్పున విజయ్ ఓలేటి అనే వ్యక్తి హైదరాబాద్‌లో అమ్మినట్లు గుర్తించారు. ప్రత్యేకంగా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకొని దందా చేశారని అధికారులు వెల్లడించారు. దీంతో రూ.వందల కోట్లు సంపాదించినట్లు తెలిపారు. ముంబై నార్కోటిక్ పోలీసుల్లో ఒకరు కార్మికుడిగా చేరి పక్కాగా వివరాలు సేకరించారన్నారు.