News March 17, 2024

ఉమ్మడి పాలమూరు నుంచి ముగ్గురికి కార్పొరేషన్ పదవులు

image

ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలకు మూడు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు దక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి లభించింది. కొల్లాపూర్ జగదీశ్వరరావుకు స్టేట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కగా, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డికి స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ పదవి వచ్చింది.

Similar News

News July 5, 2025

MBNR: BJP కొత్త సారథి.. అభినందించిన డీకే అరుణ

image

హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్.రాంచందర్ రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో పాలమూరు ఎంపీ, జాతీయ కౌన్సిల్ మెంబెర్ డీకే అరుణ నూతన ఆయన్ను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News July 5, 2025

MBNR: ‘58 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యం’

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవానికి అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లాలో మొత్తంగా 58 లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందస్తు చర్యలలో భాగంగా అటవీ, ఉపాధి హామీ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో 66.12 లక్షల మొక్కలను ఈపాటికే పెంచారు. ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గుంతలు తీసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. రహదారుల వెంట 27,26,668 మొక్కలను నాటనున్నారు.

News July 5, 2025

జడ్చర్ల: అనుమానదాస్పదంగా మెకానికల్ ఇంజినీర్ మృతి

image

ఓ మెకానికల్ ఇంజినీర్ అనుమానస్పదంగా మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఎస్ఐ విక్రమ్ తెలిపిన వివరాలు.. నవాబ్‌పేట(M) కాకర్ణాల సమీపంలోని ఓ మినరల్స్ కంపెనీలో కృష్ణా జిల్లా మంటాడకి చెందిన కాశి పూర్ణచందర్‌రావు(43) పనిచేస్తున్నారు. ఈనెల 2న విధులు ముగించుకుని గదికి వచ్చిన ఆయన గురువారం శవమై కనిపించాడు. తోటి ఉద్యోగులు పోలీసులకు సమాచారమందించారు. మృతుడి భార్య దీప్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.