News February 3, 2025
పోలీసుల ముందే కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు: రోజా

AP: కూటమి నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ‘కూటమి నేతల అరాచకాల్ని ఖండిస్తున్నాం. తిరుపతిలో మేయర్ ఎన్నిక సందర్భంగా పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. పోలీసుల ముందే కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు. మీరు నిజంగా ప్రజా మద్దతుతో గెలిచి ఉంటే ఇలా చేయాల్సిన అవసరం ఉందా? ఈ ప్రభుత్వ అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని హెచ్చరించారు.
Similar News
News January 7, 2026
ఎన్నికల్లో కూటమి దౌర్జన్యాలపై SEC, HCకి ఫిర్యాదు: జగన్

AP: MPP ఉప ఎన్నికల్లో కూటమినేతలు, ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఎన్నికల సంఘం, హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తామని YCP చీఫ్ జగన్ పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరపాల్సిన ఎన్నికను దౌర్జన్యంతో గెలుపొందడం దారుణమని మండిపడ్డారు. అనంతపురం జిల్లా బొమ్మనహళ్ MPTC సభ్యులు జగన్‌ను కలిసి ఎన్నికలో ప్రభుత్వ తీరును వివరించారు. కాగా రేపు 11amకి జగన్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.
News January 7, 2026
తల్లి వాడే పర్ఫ్యూమ్ వల్ల బిడ్డ విలవిలలాడింది!

వైద్యశాస్త్రానికే సవాలు విసిరిన ఓ వింత కేసు MH పుణేలో జరిగింది. ఓ ఎనిమిదేళ్ల అమ్మాయి 8 నెలల పాటు ఎడతెరిపి లేని దగ్గుతో విలవిలలాడింది. వైద్యులు మందులు మార్చినా తగ్గలేదు. కానీ ఒక నర్సు సూక్ష్మ పరిశీలన అద్భుతాన్ని చేసింది. ఆ తల్లి పర్ఫ్యూమ్ వల్లే బిడ్డ దగ్గుతోందని ఆమె గుర్తించింది. దానిని వాడటం మానేయగానే పాప కోలుకుంది. కొన్నిసార్లు మనం వాడే వస్తువులే పిల్లలను ఇబ్బందిపెడతాయని ఈ ఘటన గుర్తుచేస్తోంది.
News January 7, 2026
భారత్ మాకు విలువైన భాగస్వామి.. మోదీ ట్వీట్‌కు నెతన్యాహు రిప్లై

భారత్-ఇజ్రాయెల్ ప్రధానులు మోదీ, నెతన్యాహు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇజ్రాయెల్ ప్రజలకు నూతన ఏడాది శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ప్రాంతీయ పరిస్థితుల గురించి చర్చించామని మోదీ తెలిపారు. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు దృఢ సంకల్పంతో ఉన్నామని ట్వీట్ చేశారు. ‘భారతదేశంతో ఉన్న లోతైన భాగస్వామ్యాన్ని ఇజ్రాయెల్ విలువైనదిగా భావిస్తుంది. కలిసి ఉగ్రవాదాన్ని ఓడిద్దాం’ అని నెతన్యాహు రిప్లై ఇచ్చారు.


