News March 22, 2025
బీఆర్ఎస్ DNAలోనే అవినీతి ఉంది: మంత్రి సీతక్క

TG: కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు చేస్తున్న సంక్షేమాన్ని చూసి BRS ప్రభుత్వం ఓర్వలేకపోతోందని మంత్రి సీతక్క విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే త్యాగాలకు మారుపేరని తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర పరువు తీసిందని, ఆపార్టీ DNAలోనే అవినీతి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ DNAలోనే అవినీతి ఉందని శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలకు మంత్రి ఇలా కౌంటరిచ్చారు.
Similar News
News March 22, 2025
అడ్వకేట్లు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు: మంత్రి శ్రీధర్ బాబు

TG: రాష్ట్రంలో నూతన కోర్టు భవనాల నిర్మాణాలకు రూ.1000 కోట్ల నిధులు ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ‘అడ్వకేట్లు, గుమాస్తాల సంక్షేమ చట్టం సవరణ బిల్లు-2025’ను శాసనమండలిలో ప్రవేశపెట్టారు. నూతన హైకోర్టుతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాల నిర్మాణానికి రూ.2,600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. అడ్వకేట్లు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులతో పాటు ప్రమాద బీమా కల్పిస్తామని చెప్పారు.
News March 22, 2025
డీలిమిటేషన్‌తో ఉత్తరాది డామినేషన్: కేటీఆర్

TG: డీలిమిటేషన్‌కు బీఆర్ఎస్ వ్యతిరేకమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తమిళనాడులో అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఎంపీల సంఖ్య తగ్గే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఉత్తరాది డామినేషన్ పెరుగుతుందన్నారు. బీజేపీ చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శించారు.
News March 22, 2025
బీఆర్ఎస్ పార్టీని వీడను: మల్లారెడ్డి

TG: తాను కాంగ్రెస్‌లో చేరుతానని జరుగుతున్న ప్రచారంపై BRS ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తాను పార్టీని వీడట్లేదని తెలిపారు. అభివృద్ధి, మెడికల్, ఇంజినీరింగ్ సీట్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు చెప్పారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలే పరేషాన్‌లో ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ నుంచి పోటీకి తమ కుటుంబం నుంచి నలుగురు సిద్ధమన్నారు. జమిలి ఎన్నికలు వస్తే ఎంపీగా పోటీ చేస్తానన్నారు.