News October 28, 2025
కనీస మద్దతు ధర ₹8110తో పత్తి కొనుగోలు: అచ్చెన్నాయుడు

AP: రాష్ట్రంలో CCI ద్వారా 33 పత్తికొనుగోలు కేంద్రాలను రేపట్నుంచి ఆరంభించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. వీటి ద్వారా వెంటనే పత్తి సేకరణ చేపట్టాలన్నారు. 2025-26లో 4.56లక్షల హెక్టర్లలో పత్తిసాగు చేశారని, 8లక్షల టన్నుల దిగుబడి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. క్వింటాలు పత్తికి నిర్ణయించిన మద్దతు ధర ₹8110ను రైతులకు అందించాలన్నారు. రైతులు కూడా పత్తి అమ్మకాలకు నిబంధనలు పాటించాలని సూచించారు.
Similar News
News October 28, 2025
భారీ వర్షాలు.. కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కోళ్లకు వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. అందుకే కోళ్ల ఫారాన్ని శుభ్రంగా ఉంచాలి. ఫారం నుంచి నీరు బయటకు పోయేలా డ్రైనేజ్ సక్రమంగా ఉండేట్లు చూసుకోవాలి. కోళ్లకు నీరందించే నీటి బుట్టలు లీక్ కాకుండా సరి చూడాలి. లిట్టర్ బాగా తడిగా ఉంటే దాన్ని వెంటనే తొలగించాలి. ఫారంలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. కోళ్లలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెటర్నరీ డాక్టరును సంప్రదించాలి.
News October 28, 2025
బాలీవుడ్ నటుడి మంచి మనసు

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మంచి మనసు చాటుకున్నారు. ‘రామాయణ’ సినిమాకు తాను తీసుకుంటున్న పారితోషికాన్ని క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారుల వైద్యానికి వినియోగించనున్నట్లు వెల్లడించారు. హాలీవుడ్ మాస్టర్ పీస్ చిత్రాలకు భారత్ నుంచి సమాధానంగా ‘రామాయణ’ నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంకొన్ని రోజులు తన పాత్ర షూట్ మిగిలి ఉందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
News October 28, 2025
ఇంట్లో కాలుష్యానికి వీటితో చెక్

ప్రస్తుతకాలంలో కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం కష్టంగా మారింది. ఆరుబయటే కాదు ఇంట్లో కూడా కాలుష్యం విస్తరిస్తోంది. దీన్ని తగ్గించాలంటే ఇంట్లో కొన్నిమొక్కలు పెంచాలంటున్నారు నిపుణులు. బోస్టన్ ఫెర్న్, స్పైడర్ ప్లాంట్, వీపింగ్ ఫిగ్, పీస్ లిల్లీ, ఇంగ్లిష్ ఐవీ మొక్కలు గాలిని శుభ్రం చేయడంలో సహాయం చేస్తాయి. గాలి కాలుష్యాన్ని తొలగించి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయంటున్నారు.


