News October 1, 2024

పత్తి క్వింటాల్ రూ.7,521.. నేటి నుంచి కొనుగోళ్లు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో నేటి నుంచి పత్తి కొనుగోళ్లను CCI ప్రారంభించనుంది. మొత్తంగా 33 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసింది. క్వింటాల్‌కు రూ.7,521 మద్దతు ధరను చెల్లించనుంది. కొనుగోలు చేసిన 7 రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బు జమవుతుంది. పత్తి విక్రయం కోసం అన్నదాతలు దగ్గర్లోని రైతు సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్లిచ్చిన నమోదుపత్రంతో పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలి.

Similar News

News October 1, 2024

లడ్డూ వివాదం.. నేతలకు టీడీపీ కీలక ఆదేశాలు

image

AP: తిరుమల లడ్డూ అంశంలో CM చంద్రబాబు, ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తమ నేతలకు TDP కీలక ఆదేశాలిచ్చింది. కోర్టు, న్యాయమూర్తులపై విమర్శలు, వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో వాస్తవాలే ప్రజలకు చెప్పాలని కోరింది. చంద్రబాబు శ్రీవారి భక్తుడని, ల్యాబ్ నిర్ధారించిన తర్వాతే నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం ప్రజలకు చెప్పారని తెలిపింది.

News October 1, 2024

DSC ఫలితాల్లో తండ్రీకొడుకులకు ర్యాంకులు

image

TG: డీఎస్సీ ఫలితాల్లో నారాయణపేట జిల్లా రాకొండకు చెందిన గోపాల్, అతని కుమారుడు భానుప్రకాశ్ ర్యాంకులు సాధించారు. తెలుగు పండిట్‌గా జిల్లాలో గోపాల్‌కు ఫస్ట్ ర్యాంక్ రాగా, మ్యాథ్స్ సబ్జెక్టులో భాను ప్రకాశ్‌కు 9వ ర్యాంక్ వచ్చింది. గోపాల్ భార్య విజయలక్ష్మి ఇదివరకే తెలుగు పండిట్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. రెండు నెలల క్రితం వారి రెండో కుమారుడు చంద్రకాంత్ కూడా గవర్నమెంట్ జాబ్‌కు(ఏఈఈ) సెలక్ట్ అయ్యాడు.

News October 1, 2024

ఏపీలో ఖరీఫ్ సాగు 84 శాతమే

image

AP: ఖరీఫ్ సీజన్‌లో సాగు లక్ష్యం 32.50లక్షల హెక్టార్లు కాగా, 27.44లక్షల హెక్టార్లలోనే(84 శాతం) పంటలు సాగయ్యాయి. వరి సాగు 10%, పత్తి 33%, వేరుశనగ 48% తగ్గింది. పలు చోట్ల భారీ వర్షాలు, రాయలసీమలో వర్షాభావం, సకాలంలో వరుణుడు కరుణించకపోవడం వల్ల సాగు లక్ష్యం నెరవేరలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే జొన్న, కొర్ర, సజ్జ, కంది, మినుము, పెసర, సన్‌ఫ్లవర్ వంటి పంటల సాగు ఆశాజనకంగా ఉందన్నారు.