News October 3, 2025
రెండేళ్లలోపు పిల్లలకు దగ్గుమందు వాడొద్దు: కేంద్రం

రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గుమందు వాడొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఇటీవల MP, MHలో కాఫ్ సిరప్ వల్ల 11మంది పిల్లలు మరణించారు. MPలోని ఛింద్వారా జిల్లాలోనే 9మంది చనిపోయారు. వీరిలో ఐదుగురికి ‘Coldref’, ఒకరికి ‘Nextro’ సిరప్ తాగించినట్టు తేలింది. అయితే ఆయా సిరప్‌ల్లో కల్తీ లేదని తేలగా, వాటిల్లో వాడిన కెమికల్స్ వల్లే మరణాలు సంభవించొచ్చని కేంద్రం అనుమానిస్తోంది.
Similar News
News October 3, 2025
ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

APలో రేపు ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA పేర్కొంది. అటు TGలో ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, HNK, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
News October 3, 2025
శ్రీశైలం, శ్రీకాళహస్తి పాలకమండళ్లు ఏర్పాటు

AP: ప్రముఖ పుణ్యక్షేత్రాలు శ్రీశైలం, శ్రీకాళహస్తికి 16మంది చొప్పున పాలకమండలి సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం <
News October 3, 2025
అనుమతి లేని వాయిస్ వినియోగంపై బాంబే హైకోర్టు కీలక తీర్పు

AIతో ముఖాలను, స్వరాలను తారుమారు చేసి వినియోగించడం ఇటీవల సాధారణమైంది. అయితే అనుమతి లేకుండా ప్రముఖుల స్వరాన్ని, పేర్లను, చిత్రాలను వినియోగించడం వారి హక్కును ఉల్లంఘించడమేనని బాంబే హైకోర్టు పేర్కొంది. ప్రముఖ సింగర్ ఆశా భోస్లే పిటిషన్‌పై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇవి కొన్నిసార్లు మ్యానిప్లేషన్‌కు దారితీస్తాయంది. అనుమతి లేని వాటిని వెంటనే తొలగించాలని యూట్యూబ్, అమెజాన్, ఫ్లిప్‌కార్టులను ఆదేశించింది.