News November 3, 2024
కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రాణించలేకపోయా: రోహిత్

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గానూ, బ్యాటర్‌గానూ తాను అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయానని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ఈ సిరీస్ ఓటమి తనను బాధిస్తుందని చెప్పారు. జట్టుగానూ సరైన ప్రదర్శన చేయలేకపోయామని, పరాజయాలకు ఇదే కారణమని పేర్కొన్నారు. తొలి ఇన్నింగ్సులో మరో 30 పరుగులు చేయాల్సి ఉందన్నారు. అయితే NZ తమకంటే మెరుగ్గా ఆడిందని, ఓటమిని స్వీకరిస్తున్నామని తెలిపారు.
Similar News
News November 7, 2025
అమరావతి సిగలో మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటర్

ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అమరావతిలో భారీ క్వాంటమ్ కంప్యూటర్(1,200 క్యూబిట్ సామర్థ్యం)ను ఏర్పాటు చేయనుంది. రూ.1,772 కోట్ల పెట్టుబడికి సంస్థ సిద్ధమవుతోంది. ఇందుకోసం 4వేల చ.అ. విస్తీర్ణంలో భవనం అవసరముంటుంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులతో అధికారుల చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే IBM 133 క్యూబిట్, జపాన్‌కు చెందిన ఫుజిసు 64 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి.
News November 7, 2025
రాజమౌళి చిత్రం నుంచి బిగ్ అప్డేట్

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీ(SSMB29) నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ను జక్కన్న సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘‘పృథ్వీతో మొదటి షాట్ పూర్తవగానే అతని దగ్గరికి వెళ్లి నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో మీరు ఒకరు అని చెప్పాను. శక్తిమంతమైన, క్రూరమైన విరోధి ‘కుంభ’(పృథ్వీ క్యారెక్టర్ పేరు)కు ప్రాణం పోయడం సంతృప్తికరం’’ అని రాసుకొచ్చారు.
News November 7, 2025
BJP, BRS కుమ్మక్కు: మంత్రి పొన్నం

TG: జూబ్లీహిల్స్‌లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 25వేల ఓట్లు సాధించిన బీజేపీకి.. 2024 ఎంపీ ఎన్నికల్లో అక్కడే 64 వేల ఓట్లు ఎలా వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ‘2023లో BRSకు 80 వేల ఓట్లు వస్తే ఎంపీ ఎన్నికల్లో కేవలం 18 వేల ఓట్లే ఎందుకు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి BRS మద్దతు ఇస్తే శాసనసభ ఎన్నికల్లో BRSకు BJP మద్దతు ఇచ్చింది’ అని ఆరోపించారు.


