News December 21, 2024

పాతకార్లు, పాప్‌కార్న్‌పై GST పెంపునకు మండలి ఆమోదం?

image

ఎలక్ట్రిక్ సహా పాత కార్ల అమ్మకాలపై GST రేటును పెంచుతున్నారని సమాచారం. ఈ లావాదేవీలపై పన్నును 12 నుంచి 18%కి సవరించేందుకు మండలి ఆమోదం తెలిపినట్టు ET పేర్కొంది. 50% పైగా ఫ్లైయాష్ ఉండే కాంక్రీట్ బ్లాకులపై పన్నును 18 నుంచి 12కు తగ్గించారని తెలిపింది. ఉప్పు, మసాలా దట్టించిన రెడీ టు ఈట్ పాప్‌కార్న్‌పై 5%, ప్రీప్యాక్డ్, లేబుల్ ‌వేస్తే 12%, కారమెల్ వంటి షుగర్ కోటింగ్ వేస్తే 18% GST వర్తిస్తుందని సమాచారం.

Similar News

News January 7, 2026

మౌలానా వర్సిటీ భూములు వెనక్కి తీసుకుంటే ఉద్యమమే: సంజయ్

image

TG: HYDలోని మౌలానా ఉర్దూ వర్సిటీకి చెందిన 50 ఎకరాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ‘వీటిని అమ్మి దోచుకోవాలని చూస్తున్నారు. సల్కం చెరువును ఆక్రమించి విద్యా వ్యాపారం చేస్తున్న ఒవైసీపై చర్యలేవి? వాటిని ఎందుకు తీసుకోవడం లేదు?’ అని ప్రశ్నించారు. GOVT తీరుపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాగా వర్సిటీలో వినియోగించని 50 ఎకరాల స్వాధీనానికి గతనెల కలెక్టర్ నోటీసులిచ్చారు.

News January 7, 2026

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>CSIR<<>>-సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ 7 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 14 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc(ఎలక్ట్రానిక్స్/ఫిజిక్స్/ అప్లైడ్ ఫిజిక్స్/అప్లైడ్ ఎలక్ట్రానిక్స్), BE/BTech, ME/MTech, టెన్త్+డిప్లొమా (MLT/DMLT) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ceeri.res.in

News January 7, 2026

తేనెతో చర్మానికి తేమ

image

పొడిబారే చర్మతత్వానికి తేనె ప్యాక్‌లు వాడితే బాగా తేమగా మారుతుందంటున్నారు చర్మ నిపుణులు. పచ్చిపాలకు తేనె కలిపి ముఖానికి రాసి ఆరనిచ్చి కడిగితే చర్మం తేమగా మారుతుంది. అలాగే తేనె, కలబంద, పాలు కలిపి ముఖానికి రాసి ఆరనిచ్చి కడిగితే చర్మం తేమగా మారుతుంది. చెంచా చొప్పున తేనె, కలబంద గుజ్జుకు రెండు చుక్కలు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ముఖానికి పూత వేయాలి. 10 నిమిషాల తర్వాత కడిగితే చర్మానికి తేమ అందుతుంది.