News March 16, 2024
కౌంట్‌డౌన్ @59

ఏపీలో ఎన్నికల నగారా మోగింది. నేటి నుంచి సరిగ్గా 59వ రోజు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది. అభ్యర్థులు మే 11 సాయంత్రం 5 గంటలకు వరకు ప్రచారం చేసుకోవచ్చు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. దాదాపు 2 నెలల పాటు రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగనుంది.
Similar News
News April 9, 2025
ప్రేమ పెళ్లి.. పరువు హత్య?

AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మం. నరసింగాపురంలో పరువు హత్య జరిగినట్లు తెలుస్తోంది. అజయ్, మైనర్ బాలిక (17) ఏడాది క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆమె గర్భవతి. పేరెంట్స్ బాలికకు అబార్షన్ చేయించి, అజయ్‌పై పోక్సో కేసు పెట్టారు. అయినా ఆమె తరచూ అతడిని కలుస్తుండటంతో తల్లిదండ్రులు మందలించారు. ఈ క్రమంలో ఈ నెల 4న బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. తల్లిదండ్రులే చంపి ఉంటారని అనుమానిస్తున్నారు.
News April 9, 2025
TG CM రేవంత్‌పై ఏపీ మంత్రి ఫైర్.. కారణమిదే

PM మోదీని TG CM రేవంత్ గాడ్సేతో పోల్చడంపై AP మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. ‘హామీలు అమలు చేయలేని అసమర్థ CM రేవంత్.. తుమ్మితే ఊడిపోయే తన పదవి కోసం ఇలా మాట్లాడుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజల దృష్టిని మరల్చడం ఆయనకు అలవాటే. ఆయన స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారు. BJPని అడ్డుకోవడం గాంధీ కుటుంబం వల్లే కాలేదు. ఆ కుటుంబ మోచేతి నీళ్లు తాగే రేవంత్ వల్ల ఏమవుతుంది?’ అని ట్వీట్ చేశారు.
News April 9, 2025
రేపు ఏపీ, తెలంగాణలో వర్షాలు

రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని APSDMA తెలిపింది. అటు తెలంగాణలో రేపు సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, HYD, యాదాద్రి, రంగారెడ్డి, MBNR, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.