News April 3, 2024
అసత్య ప్రచారానికి కొత్త వెబ్‌సైట్‌తో అడ్డుకట్ట

లోక్‌సభ ఎన్నికల వేళ అసత్య ప్రచారాలను అడ్డుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త వెబ్‌సైట్‌ను రూపొందించింది. ‘mythvsreality.eci.gov.in’ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నికల సమయంలో ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించే దిశగా దీనిని రూపొందించినట్లు ఈసీ వెల్లడించింది. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు వెలుగులోకి వచ్చిన అసత్య ప్రచారాలను ప్రజలకు ఈ వెబ్సైట్ ద్వారా తెలియజేస్తామంది.
Similar News
News November 21, 2025
తిరుపతి: ఆధార్ తప్పులతో ఆగిన ఆపార్..!

ఎన్ఈపీలో భాగంగా ఆధార్ లింక్‌తో విద్యార్థులకు ఆపార్ అందిస్తున్నారు. తిరుపతి జిల్లాలో 3,86,167 మంది ఉన్నారు. ఆపార్ వచ్చిన విద్యార్థులు 3,35,534 మంది కాగా.. పెండింగ్‌లో 50,633 మంది విద్యార్థులు ఉన్నారు. పదో తరగతి విద్యార్థులకు ఆపార్ నంబర్ తప్పనిసరి కావాల్సి ఉంది. ఇంటి పేర్లు, పుట్టిన తేదీల్లో ఎక్కువ శాతం తప్పులు ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తోంది.
News November 21, 2025
బరితెగించారు.. మోదీ-మైథిలీపై AI అసభ్యకర వీడియో

AI టెక్నాలజీతో క్రియేటర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా పీఎం మోదీ, బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన సింగర్ మైథిలి ఠాకూర్‌పై అసభ్యకర AI వీడియోను రూపొందించి SMలో పెట్టారు. దీన్ని బీజేపీ నేతలు, శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వెంటనే ఆ వీడియోను తొలగించాలని, క్రియేట్ చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
NOTE: సెన్సిటివిటీ దృష్ట్యా వీడియోను పోస్ట్ చేయలేకపోతున్నాం.
News November 21, 2025
RTC బస్సులో ప్రయాణించిన సీఎం సతీమణి

AP: కూటమి ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని CM చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వినియోగించుకున్నారు. ఆధార్ కార్డు చూపించి, ఫ్రీ టికెట్ పొందారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆమె శాంతిపురం నుంచి తుమ్మిసి వరకు బస్సులో ప్రయాణించారు. మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలుసుకున్నారు. అనంతరం తుమ్మిసి పెద్ద చెరువులో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.


