News June 5, 2024
ప్రారంభమైన కౌంటింగ్
TG: ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు <<13382331>>ప్రక్రియ<<>> ప్రారంభమైంది. ఈ స్థానంలో ప్రధాన అభ్యర్థులుగా రాకేశ్ రెడ్డి(BRS), తీన్మార్ మల్లన్న(కాంగ్రెస్), ప్రేమేందర్ రెడ్డి(బీజేపీ), అశోక్(స్వతంత్ర) బరిలో ఉన్నారు. నిన్న వెల్లడైన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీకి సమాన సీట్లు వచ్చాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో కామెంట్ చేయండి.
Similar News
News November 28, 2024
ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్!
యూజర్ల సౌలభ్యం కోసం ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ తరహాలో IGలోనూ లొకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం యూజర్లు చాట్‌లోకి వెళ్లిన తర్వాత మెనూబార్‌లో లొకేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కరెంట్ లొకేషన్‌తో పాటు గంటపాటు లైవ్ లొకేషన్‌నూ షేర్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్ ప్రస్తుతం కొన్ని దేశాలకే పరిమితం చేసినట్లు మెటా సంస్థ పేర్కొంది. త్వరలో మిగిలిన దేశాలకూ విస్తరించనుంది.
News November 28, 2024
మహారాష్ట్ర CM ఎంపికపై నేడు కీలక భేటీ
మహారాష్ట్ర CM ఎవరనే ప్రశ్నకు నేడు సమాధానం దొరికే అవకాశముంది. ఢిల్లీలో BJP అగ్రనేతలతో ఫడణవీస్, శిండే, అజిత్ పవార్ భేటీ కానున్నారు. CM ఎవరన్నది ‘మహాయుతి’ నేతలు ఈ మీటింగ్‌లో ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. CM, ఇద్దరు dy.CMలు ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఎక్కువ శాతం BJPనే పదవి వరించే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 23న ఎన్నికల ఫలితాలు రాగా, 5 రోజులుగా సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
News November 28, 2024
వాలంటీర్లకు మరో షాక్
AP: ఉద్యోగ భద్రత కల్పించాలని, రూ.10వేల జీతం పెంచాలని 5 నెలలుగా ఆందోళన చేస్తున్న వాలంటీర్లకు మరో షాక్ తగిలింది. గ్రామ, వార్డు సచివాలయ శాఖకు సంబంధించిన మొబైల్ యాప్‌లో వాలంటీర్లు హాజరువేసుకునే ఆప్షన్‌ను అధికారులు తొలగించారు. వారం కిందటి వరకు ఈ సదుపాయం ఉండగా మంత్రి వీరాంజనేయస్వామి వాలంటీర్లు వ్యవస్థలో లేరని ప్రకటించాక పూర్తిగా ఆప్షన్‌ను తీసేసినట్లు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు.