News June 7, 2024
MLC ఓట్ల కౌంటింగ్.. 33 మంది ఎలిమినేషన్

TG: నల్గొండ-వరంగల్-ఖమ్మం MLC ఉపఎన్నికల కౌంటింగ్‌లో 33 మంది అభ్యర్థులను ఇప్పటివరకు ఎలిమినేషన్ చేశారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,696 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 1,23,210, BRS అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 1,04,514 ఓట్లు వచ్చాయి. గెలుపు కోసం 1,55,095 ఓట్లు అవసరం కాగా.. మల్లన్నకు 31,885, రాకేశ్‌కు 50,581 ఓట్లు కావాలి.
Similar News
News September 12, 2025
బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో టీటీడీ ఈవో భేటీ

AP: బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ అధికారులకు సూచించారు. ఈ వేడుకల్లో పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేయాలని చెప్పారు. రద్దీకి అనుగుణంగా పార్కింగ్ ఏర్పాటు చేయాలని, భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని తెలిపారు. 3,500 మంది శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలని, మెట్ల మార్గాల్లో భద్రత మరింత పటిష్ఠం చేయాలని దిశానిర్దేశం చేశారు.
News September 11, 2025
నక్సలైట్లందరూ సరెండర్ అవ్వాలి: అమిత్ షా

ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో 10 మంది నక్సలైట్లు మరణించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ‘CRPF కోబ్రా కమాండర్స్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, DRG జాయింట్ ఆపరేషన్ చేపట్టి 10 మంది నొటోరియస్ నక్సలైట్లను హతమార్చారు. రూ.కోటి బౌంటీ ఉన్న CCM మోడెమ్ బాలకృష్ణ అలియాస్ మనోజ్‌ను కూడా మట్టుబెట్టారు. మిగిలిన నక్సలైట్లందరూ గడువులోగా లొంగిపోవాలి. మార్చి 31లోపు రెడ్ టెర్రర్ను ఏరివేయడం ఖాయం’ అని ట్వీట్ చేశారు.
News September 11, 2025
టీడీపీ స్ర్కిప్ట్‌నే బీజేపీ ఫాలో అవుతోంది: పేర్ని నాని

AP: హిందూ మతం ముసుగులో YCPపై బీజేపీ నేతలు మాధవ్, పురందీశ్వరి విషం చిమ్ముతున్నారని పేర్ని నాని ఫైరయ్యారు. టీడీపీ స్క్రిప్ట్‌ను BJP నేతలు కాపీ పేస్ట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. దీని బదులు పవన్‌లాగా పార్టీని చంద్రబాబుకు అద్దెకు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. అంతర్వేది రథం ధ్వంసంపై తాము ఆనాడే సీబీఐ విచారణ కోరినట్లు తెలిపారు. TDP, బీజేపీ కలిసి ఉన్నప్పుడే APలో అత్యధికంగా ఆలయాలు ధ్వంసమయ్యాయన్నారు.