News June 4, 2024

2019లో నోటా ఓట్ల లెక్క‌

image

2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నోటాకు 65,22,772 ఓట్లు పోల్ అయ్యాయి. బిహార్‌లో అత్య‌ధికంగా 8.16 ల‌క్ష‌ల ఓట్లు, ఉత్తరప్రదేశ్‌లో 7.25 ల‌క్ష‌లు, తమిళనాడులో 5.50 ల‌క్ష‌ల ఓట్లు, పశ్చిమ బెంగాల్‌లో 5.46 ల‌క్ష‌ల ఓట్లు, మహారాష్ట్రలో 4.88 ల‌క్ష‌ల ఓట్లు పోల‌య్యాయి. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏపీలో 1.28% ఓట్లు నోటాకు పోల‌య్యాయి.

Similar News

News February 9, 2026

కృష్ణా: ప్రయాణికులకు శుభవార్త.. ఆ 2 రైళ్ల వరకు పొడిగింపు

image

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా SMVT బెంగళూరు(SMVB)- నరసాపురం(NS) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07154 SMVB- NS రైలు మార్చి 7 నుంచి 28 వరకు ప్రతి శనివారం, నం.07153 NS- SMVB మధ్య నడిచే రైలు మార్చి 6 నుంచి 27 వరకు ప్రతి రాకపోకలు సాగిస్తాయన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలో విజయవాడతో పాటు గుడివాడ, కైకలూరులో ఆగుతాయన్నారు.

News February 9, 2026

మంత్రులకు సీఎం CBN క్లాస్!

image

AP: రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై రివ్యూ సందర్భంగా CM చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘మంత్రులంటే కేవలం పాలసీలు చేసేవాళ్లు కాదు. జనాభా పెరుగుదలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. గర్భనిరోధక ఆపరేషన్లు తగ్గించాలి. పాపులేషన్ మేనేజ్‌మెంట్‌పై అసెంబ్లీలో పాలసీ ప్రకటిస్తాం. జనాభా పెంచేందుకు ప్రోత్సాహకాలిస్తాం. APR 1 నుంచి పాలసీ ప్రణాళిక రూపొందిస్తాం’ అని చెప్పినట్లు సమాచారం.

News February 9, 2026

ఇటలీపై స్కాట్లాండ్ ఘన విజయం

image

T20WCలో భాగంగా ఇటలీతో జరిగిన <<19091297>>మ్యాచ్‌లో<<>> స్కాట్లాండ్ 73 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 208 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఇటలీ 16.4 ఓవర్లలో 134 స్కోరుకే ఆలౌటైంది. బెన్ మనేంటి(52), హ్యారీ మనేంటి(37), జేజే స్మట్స్(22) మినహా అందరూ విఫలమయ్యారు. స్కాట్లాండ్ బౌలర్లలో మైఖేల్ లీస్క్ 4, మార్క్ 2, బ్రాడ్ కుర్రీ, వీల్, ఒలీవర్ తలో వికెట్ తీశారు.