News August 14, 2025
నేడే పులివెందుల, ఒంటిమిట్ట ఉపఎన్నిక కౌంటింగ్

AP: తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉ.8 గంటలకు ప్రారంభం కానుంది. భారీ బందోబస్తు నడుమ కడప శివారులోని ఉర్దూ నేషనల్ వర్సిటీలో లెక్కింపు చేపట్టనున్నారు. మధ్యాహ్నంలోగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. పులివెందులలో 76శాతం, ఒంటిమిట్టలో 86శాతం పోలింగ్ నమోదైంది. రెండు చోట్లా 11 మంది చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నా టీడీపీ, వైసీపీ మధ్యే హోరాహోరీ పోటీ ఉండనుంది.
Similar News
News August 14, 2025
ఇండిపెండెన్స్ డే: 1090 మందికి గ్యాలంట్రీ అవార్డ్స్

రేపు ఇండిపెండెన్స్ డే సందర్భంగా కేంద్ర హోం శాఖ పోలీసులకు గ్యాలంట్రీ అవార్డ్స్ ఇవ్వనుంది. ఈ మేరకు పోలీస్, ఫైర్, హోమ్ గార్డ్&సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్‌లో 1090 మందికి పురస్కారాలు ప్రకటించింది. వీటిల్లో గ్యాలంట్రీ మెడల్స్(GM) 233, రాష్ట్రపతి మెడల్స్(PSM) 99, మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్(MSM) 758 ఉన్నాయి. తెలంగాణకు MSM 18, PSM 2, GM 1, ఆంధ్రప్రదేశ్‌కు MSM 23, PSM 2 మెడల్స్ ప్రకటించింది.
News August 14, 2025
జిల్లా టాపర్లకు రూ.10,000

TG: ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో టెన్త్, ఇంటర్ చదివి జిల్లా టాపర్లుగా నిలిచిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. ప్రతి జిల్లాలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలకు రూ.10,000 చొప్పున ఇవ్వనుంది. స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ఈ బహుమతులు ఇవ్వాలని, స్కూళ్లు, జిల్లా స్థాయిలో ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ సూచించింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించాలని ఆదేశించింది.
News August 14, 2025
కొత్త వాహనాలు కొంటున్నారా?

TG: రాష్ట్రంలో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్‌ను ప్రభుత్వం పెంచింది. ఎక్స్‌షోరూం ధరను బట్టి ద్విచక్ర వాహనాలకు 3, కార్లు, ఇతర వ్యక్తిగత వాహనాలకు 5 శ్లాబుల్లో పన్ను విధించనుంది. తక్కువ ధర వెహికిల్స్‌పై ఈ ప్రభావం ఉండదు. బైక్ ధర ₹లక్ష దాటితే 3%, ₹2 లక్షలు మించితే 6%, కార్ల ధర ₹10 లక్షలు దాటితే 1% ట్యాక్స్ పెరగనుంది. ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చే ఈ పన్నులతో కొనుగోలుదారులపై సుమారు రూ.3 వేల భారం పడనుంది.