News November 23, 2024

ఓట్ల లెక్కింపు ప్రారంభం

image

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు సహా దేశంలోని 48 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల బైపోల్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. అవి పూర్తయిన తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఎర్లీ ట్రెండ్స్ వెలువడనున్నాయి. మధ్యాహ్నం లోపు రిజల్ట్స్‌పై క్లారిటీ రానుంది.

Similar News

News December 19, 2025

భారత జలాల్లోకి బంగ్లా బోట్లు.. కవ్వింపు చర్యలు?

image

భారత జలాల్లోకి బంగ్లాదేశ్‌ ఫిషింగ్ బోట్లు వస్తున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. 4 రోజుల కిందట బంగ్లా నేవీ గస్తీ నౌక ఇలానే వచ్చింది. బంగ్లాలో త్వరలో ఎన్నికలు ఉండటం, అక్కడ అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో భారత నిఘా వర్గాలు కీలక విషయాన్ని గుర్తించాయి. భారత్‌ను కవ్వించేందుకు బంగ్లా ఇలా చేస్తోందని వెల్లడించాయి. పేద జాలర్లను భారత్ వేధిస్తోందని చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నమని చెప్పాయి.

News December 19, 2025

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) 11 డొమైన్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. జీతం నెలకు రూ.60,000-రూ.70,000వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ugc.gov.in

News December 19, 2025

వరద జలాలపై హక్కు ఏపీదే: రామానాయుడు

image

ఏటా 4వేల TMCల గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని మంత్రి రామానాయుడు ఢిల్లీలో మీడియాతో పేర్కొన్నారు. ‘వరద జలాలపై హక్కు కింది రాష్ట్రంగా APకే ఉంటుంది. పోలవరంపై 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్‌ను శాశ్వతంగా రద్దు చేయాలి. కెనాల్‌ల సామర్థ్యం 17వేల క్యూసెక్కులకు పెంచి ఆ అదనపు వ్యయాన్ని ప్రాజెక్టు ఖర్చులో చేర్చాలి. గోదావరి జలాలపై ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి’ అని కేంద్రాన్ని కోరారు.