News June 4, 2024

దర్శిలో నిలిచిపోయిన కౌంటింగ్?

image

AP: ప్రకాశం జిల్లా దర్శిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇప్పటివరకు 16 రౌండ్లు పూర్తి కాగా ప్రస్తుతం కౌంటింగ్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అక్కడ వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ 827 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Similar News

News January 18, 2026

Friendflationతో ఒంటరవుతున్న యువత!

image

ఇన్‌ఫ్లేషన్ ఇప్పుడు ఫ్రెండ్‌ఫ్లేషన్‌గా మారి యువతను ఒంటరి చేస్తోంది. పెరిగిన హోటల్ బిల్లులు, సినిమా టికెట్లు, పెట్రోల్ ఖర్చుల భయంతో మెట్రో నగరాల్లోని యువత బయటకు వెళ్లడం తగ్గించేస్తున్నారు. ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఖర్చు భరించలేక చాలామంది ఇన్విటేషన్లను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. పార్కులు, ఇంటి దగ్గర చిన్నపాటి మీటింగ్స్ వంటి లో-కాస్ట్ ప్లాన్స్‌తో స్నేహాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News January 18, 2026

జోరందుకున్న మద్యం అమ్మకాలు

image

AP: సంక్రాంతి పండుగ పురస్కరించుకొని రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు సాధారణ రోజులతో పోల్చితే రెట్టింపు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ప్రతి రోజూ రూ.85 కోట్ల లిక్కర్ సేల్ జరిగినట్లు లెక్కలు వెల్లడించాయి. ఈ వారం వ్యవధిలో రూ.877 కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు చెప్పాయి. పండుగ 3 రోజుల్లో రూ.438 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు తెలిపాయి.

News January 18, 2026

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు

image

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (<>AIIA<<>>) 33 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, BE/BTech/MCA/BSc, డిప్లొమా, MCom/MBA, MSc(నర్సింగ్), BCom/BBA, BSc(బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ), డిగ్రీ(యోగా), DMLT, పంచకర్మ(డిప్లొమా), ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 3. వెబ్‌సైట్: https://aiia.gov.in