News October 4, 2024

అత్యుత్తమ వైద్య సదుపాయాలున్న దేశాలు!

image

CEO వరల్డ్ మ్యాగజైన్ విడుదల చేసిన హెల్త్ కేర్ ఇండెక్స్-2024 ప్రకారం 100కి 78.72 స్కోరుతో తైవాన్ దేశం అత్యుత్తమ వైద్య సదుపాయాలను కలిగి ఉంది. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది అందుబాటుపై సర్వే చేసి ప్రతి దేశానికి స్కోరునిచ్చారు. దక్షిణ కొరియా(77.7), ఆస్ట్రేలియా(74.11), కెనడా(71.32), స్వీడన్(70.73) టాప్-5లో ఉన్నాయి. కాగా, ఇండియాకు 45.84 స్కోర్ లభించింది.

Similar News

News October 7, 2024

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఫుడ్‌లో మనిషి దంతం

image

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఆహారంలో బొద్దింక, బల్లులు, పురుగులు వచ్చిన ఘటనలు మరువకముందే ఓ వ్యక్తికి ఫుడ్‌లో మనిషి దంతాలు కనిపించాయి. పంజాబ్‌లోని ఢకోలికి చెందిన మనోజ్ అనే వ్యక్తి జొమాటోలో స్థానిక రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేయగా అందులో మనిషి దంతాలు వచ్చినట్లు ఆరోపించారు. తినే ప్లేట్‌తోనే రెస్టారెంట్‌కు వెళ్లి మేనేజర్‌కు ఫిర్యాదు చేసి మనోజ్ గొడవ చేశారు.

News October 7, 2024

నటుడితో ఓలా ఎలక్ట్రిక్ ఓనర్ వాగ్వాదం: 9% క్రాషైన షేర్లు

image

వరెస్ట్ సర్వీస్ కంప్లైంట్లు, ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్‌తో ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 43% తగ్గాయి. నటుడు కునాల్‌తో కంపెనీ ఓనర్ భవీశ్ అగర్వాల్ Xలో వాదనకు దిగడంతో నేడు 9% క్రాష్ అయ్యాయి. ‘భారత కస్టమర్లకు గొంతుందా? వాళ్లకిదేనా దక్కేది’ అంటూ దుమ్ముపట్టిన ఓలా స్కూటర్ల ఫొటోను కునాల్ పోస్ట్ చేశారు. ‘సాయం చేస్తే ఈ పెయిడ్ ట్వీట్, మీ ఫెయిల్డ్ కెరీర్లో సంపాదన కన్నా ఎక్కువే ఇస్తాన’ని భవీశ్ స్పందించారు.

News October 7, 2024

డిజిటల్ హెల్త్ కార్డులపై ఆ ప్రచారం అవాస్తవం: ప్రభుత్వం

image

TG: ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులకు సంబంధించి తెలుగులో దరఖాస్తు ఫామ్ విడుదల చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం కొట్టిపారేసింది. కార్డుల డిజైన్ ఇంకా ఫైనల్ కాలేదని, ప్రభుత్వం ఎలాంటి దరఖాస్తుల ఫామ్‌ను రిలీజ్ చేయలేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ఫేక్ దరఖాస్తులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.