News May 3, 2024
మోదీ హయాంలో దేశం నాశనం: కేసీఆర్

TG: తన ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం ముగియడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగారు. రామగుండం రోడ్‌షోలో మాట్లాడుతూ.. ‘మోదీ హయాంలో దేశం నాశనం అవుతోంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.84కు దిగజారింది. ఆయన పాలనలో మత విద్వేషం తప్ప ఇంకేమీ లేదు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ గెలుస్తుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
శరణు ఘోషతోనే కొండ ఎక్కుతారు

శబరి యాత్రలో ఎత్తైన, నిట్టనిలువు కొండ ‘కరిమల’. సుమారు 10KM ఎత్తుకు వెళ్లిన తర్వాత భక్తులు దీని శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ అతి ప్రాచీనమైన బావి, జలపాతం ఉన్నాయి. భక్తులు ఇక్కడ దాహార్తిని తీర్చుకుంటారు. ఇంత ఎత్తులో జలపాతం ఉండటం దీని ప్రత్యేకత. ఈ కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే శరణు ఘోష ముందు ఈ కష్టం దూది పింజెలా తేలిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>
News November 24, 2025
IIT ధన్‌బాద్ 105 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 24, 2025
జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జీవో నం.46 ప్రకారం 50% క్యాప్‌తో రిజర్వు స్థానాలు ఖరారు చేస్తూ కాసేపటి క్రితం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందులో SC, STల పంచాయతీలు యథాతథంగా ఉండగా 22% రిజర్వేషన్ మాత్రమే అమలు చేస్తుండటంతో పలుచోట్ల BCల రిజర్వు స్థానాలు మారాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సైతం ఈ వివరాలు పంపింది.


