News October 29, 2024
పల్లె రోడ్లకు మహర్దశ!
TG: రాష్ట్రంలో వచ్చే నాలుగేళ్లలో గ్రామాల్లో 17,300km మేర రోడ్లను ppp మోడల్‌లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతి ఏడాది 4,000-5,000km రోడ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకుంది. పంచాయతీరాజ్ విభాగం కింద బీటీ రోడ్లు 26146.83km, WBM రోడ్లు 7752.10km, సీసీ రోడ్లు 4146.63km, మట్టిరోడ్లు 30493.72km మేర వేయనుంది. దీనికి మొత్తంగా రూ.12,000కోట్లు ఖర్చు కానుందని అంచనా.
Similar News
News October 30, 2024
మయోనైజ్‌పై ప్రభుత్వం నిషేధం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో మంది అనారోగ్యాలకు కారణం అవుతున్న మయోనైజ్‌ను ఏడాది పాటు నిషేధిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మయోనైజ్‌ను వినియోగించకుండా హోటళ్లు, ఫుడ్‌స్టాళ్లలో తరచూ తనిఖీలు చేయాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. కాగా మయోనైజ్ తిని ఇటీవల హైదరాబాద్‌లో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.
News October 30, 2024
SPFకు సచివాలయ భద్రత
TG: రాష్ట్ర సచివాలయ భద్రత బాధ్యతను ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(SPF)కు అప్పగించింది. ఇప్పటివరకు తెలంగాణ స్పెషల్ పోలీస్(TGSP) విధులు నిర్వహించింది. పాత సచివాలయంలో 25 ఏళ్లుగా SPF సిబ్బందే భద్రతను పర్యవేక్షించారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం తర్వాత అప్పటి BRS సర్కార్ TGSPని నియమించింది. అయితే ఇటీవల బెటాలియన్ పోలీసుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా వారిని తొలగించినట్లు తెలుస్తోంది.
News October 30, 2024
హర్షసాయికి హైకోర్టులో భారీ ఊరట
ప్రముఖ యూట్యూబర్ హర్షసాయికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హర్షసాయి పిటిషన్‌పై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా హర్షసాయి తన దగ్గర రూ.2 కోట్లు తీసుకోవడమే కాకుండా లైంగికంగా వేధించాడంటూ ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి హర్ష పరారీలోనే ఉన్నారు.