News January 5, 2025

దంపతుల టోకరా.. వ్యాపారవేత్తకు ₹7.63 కోట్ల మోసం

image

అధిక రాబ‌డులకు ఆశ ప‌డి నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ₹7.63 కోట్లు న‌ష్ట‌పోయారు. జ‌యంత్ గులాబ్‌రావ్‌, అత‌ని భార్య కేస‌రి ఓ సంస్థ‌లో పెట్టుబ‌డులు పెడితే ఏటా 35% లాభాలు వ‌స్తాయ‌ని జితేంద‌ర్ జోషిని న‌మ్మించారు. ప్రారంభంలో మంచి లాభాలు రావడంతో జోషి భారీగా పెట్టుబ‌డులు పెట్టారు. తీరా జ‌యంత్ దంప‌తులు మొహం చాటేయ‌డంతో జోషి ₹7.63Cr మోస‌పోయారు. ఆర్థిక నేర విభాగం కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తోంది.

Similar News

News January 7, 2025

తిరుమలలో పెరిగిన రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 16కంపార్ట్‌మెంట్లలో వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 54,180 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.20కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

News January 7, 2025

స్పౌజ్ కేటగిరీ పెన్షన్‌పై వారిలో ఆందోళన!

image

AP: పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే స్పౌజ్ కేటగిరీలో భార్యకు ఇస్తున్న పెన్షన్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భర్త చనిపోయిన భార్యకే కాకుండా భార్య చనిపోయిన భర్తకూ వర్తింపజేయాలని కోరుతున్నారు. భార్య చనిపోయి ఇప్పటి వరకు పెన్షన్ రాని భర్తల్లో ఆందోళన నెలకొందని చెబుతున్నారు. అటు, నవంబర్ 1- డిసెంబర్ 15 మధ్య 23K మంది చనిపోతే, స్పౌజ్ పెన్షన్లు 5K మందికే ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

News January 7, 2025

నేటి నుంచి విధుల్లోకి సమగ్ర శిక్ష ఉద్యోగులు

image

TG: పలు డిమాండ్లతో గత కొన్ని రోజులుగా విధులను బహిష్కరించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. Dy.CM భట్టితో చర్చలు సఫలం కావడంతో నేటి నుంచి విధుల్లోకి రానున్నారు. విద్యాశాఖలో విలీనం, పే స్కేల్ అమలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ వంటివి అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీటిపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భట్టి హామీ ఇచ్చారు.