News January 18, 2025
విడాకుల కేసులో సాక్ష్యంగా దంపతుల వాయిస్ రికార్డింగ్స్.. కోర్టు ఏమందంటే?

విడాకుల కేసు విచారణలో చట్టబద్ధత, నైతికతపై సుప్రీంకోర్టులో కీలక చర్చ జరిగింది. భార్యతో జరిగిన సంభాషణలను భర్త సాక్ష్యంగా ప్రవేశపెట్టడంపై జస్టిస్ నాగరత్న అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇన్నేళ్లుగా భార్య మాటల్ని రికార్డ్ చేసే భర్త ఎవరుంటారు? ఈ కేసులో ఆర్టికల్-21 కింద గోప్యతా హక్కు, ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్-122 వర్తిస్తుందా లేదా అనేది పరిశీలిస్తాం’ అని పేర్కొన్నారు. తదుపరి విచారణను FEB 18కి వాయిదా వేశారు.
Similar News
News November 24, 2025
స్మృతి మంధాన కాబోయే భర్తకూ అనారోగ్యం!

మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు బ్యాడ్ లక్ కొనసాగుతోంది. తండ్రికి హార్ట్ అటాక్ రావడంతో నిన్న జరగాల్సిన పెళ్లి <<18368671>>వాయిదా<<>> పడింది. ఆ తర్వాత కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురైనట్లు NDTV తెలిపింది. వైరల్ ఫీవర్తో పాటు ఎసిడిటీ పెరగడంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపింది. చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. మరోవైపు స్మృతి తండ్రిని అబ్జర్వేషన్లో ఉంచినట్లు ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు.
News November 24, 2025
ఎలుకల నివారణకు జింకు ఫాస్పేట్ ఎర

ఎలుకల వల్ల పంట నష్టం ఎక్కువగా ఉంటే పంట కాలంలో ఒక్కసారి మాత్రమే జింకు ఫాస్పేట్ ఎరను వాడాలి. దీనికి ముందుగా విషం లేని ఎరను 20 గ్రాములు (98శాతం నూకలు, 2శాతం నూనె) పొట్లాలుగా చేసి ఎలుక కన్నానికి ముందు ఒకటి చొప్పున ఉంచాలి. ఇలా ఎలుకకు 2 రోజులు అలవాటు చేసి 3వరోజు జింకు ఫాస్పేట్ ఎరను 10 గ్రాములు (96% నూకలు, 2% నూనె, 2% మందు) పొట్లాలుగా కట్టి ఎలుక కన్నంలో ఒకటి చొప్పున వేయాలి. ఇవి తిన్న ఎలుకలు మరణిస్తాయి.
News November 24, 2025
ముగిసిన G20 సమ్మిట్.. చర్చించిన అంశాలివే..

సౌతాఫ్రికాలో జరిగిన G20 సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. 20దేశాలకు చెందిన దేశాధినేతలు ఇందులో పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా దేశాల మధ్య యుద్ధ వాతావరణాలను తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులు, మైనింగ్, టెక్నాలజీ, AI సాంకేతికతలో పరస్పరం సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చారు. రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపైనా చర్చించారు.


