News November 20, 2024
ధైర్యం సరిపోవడంలేదా చిట్టినాయుడు?: KTR
TG: మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘నిమిషానికి 40 సార్లు KCR రావాలే అని తెగ అరుస్తావు! అసెంబ్లీలో కేసీఆర్ ముందు నిల్చునే మాట దేవుడెరుగు, కనీసం మహబూబాబాద్లో మహాధర్నాకు అనుమతిచ్చేందుకు ధైర్యం సరిపోవడంలేదా చిట్టినాయుడు?’ అని ఎద్దేవా చేస్తూ Xలో పోస్ట్ చేశారు.
Similar News
News November 26, 2024
రూ.27 కోట్లలో రిషభ్ చేతికి వచ్చేది ఎంతంటే..
IPL చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషభ్ పంత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. లక్నో అతడిని రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. దీనిలో రూ.8.1 కోట్లు పన్నుగా వెళ్లిపోగా పంత్ చేతికి రూ.18.9 కోట్లు అందుతాయి. ఒకవేళ టోర్నీకి ముందే గాయపడినా, వ్యక్తిగత కారణాలతో తప్పుకొన్నా ఆ డబ్బు రాదు. టోర్నీ మధ్యలో గాయపడి తప్పుకుంటే మాత్రం చెల్లిస్తారు. భారత మ్యాచ్లకు ఆడుతూ గాయపడినా డబ్బు దక్కుతుంది.
News November 26, 2024
మన ధైర్యాన్ని పరీక్షించిన రోజు 26/11: సచిన్
ముంబైలో ఉగ్రదాడి జరిగి నేటికి 16 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆ రోజును ట్విటర్లో గుర్తుచేసుకున్నారు. ‘2008 నవంబరు 26.. మనల్ని పరీక్షించిన ఆ రోజు మన ధైర్యాన్ని దెబ్బతీయలేకపోయింది. ఓ జాతిగా మనకున్న బలాన్ని ఆరోజు మన హీరోలు చూపించిన తెగువ, ముంబైలోని ప్రతి పౌరుడి పట్టుదల ఎప్పుడూ గుర్తుచేస్తుంటాయి. గుర్తుపెట్టుకుంటాం. గౌరవించుకుంటాం. ఐకమత్యంగా ఉంటాం’ అని ట్వీట్ చేశారు.
News November 26, 2024
ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల
ఏపీలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఆ రోజు నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు డిసెంబర్ 13తో ముగియనుంది. డిసెంబర్ 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. మోపిదేవి, బీద మస్తాన్, ఆర్.కృష్ణయ్య రాజీనామాలతో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే.