News December 12, 2024

విజయ్‌ పాల్ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి

image

AP: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్ట్ అయిన విజయ్‌ పాల్‌ను రెండు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 13, 14 తేదీల్లో ఆయన్ను విచారించనున్నారు. విజయపాల్ ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామను గత ప్రభుత్వ హయాంలో కస్టడీలో చిత్రహింసలు పెట్టారన్న కేసులో CID మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Similar News

News September 19, 2025

భారత్‌ను ఓడించిన కివీసే మా స్ఫూర్తి: WI కోచ్

image

భారత్‌లో ఆడే టెస్ట్ సిరీస్‌లో రాణించేందుకు న్యూజిలాండ్‌ను స్ఫూర్తిగా తీసుకుంటామని వెస్టిండీస్ కోచ్ డారెన్ సమీ అన్నారు. ‘గత ఏడాది ఇండియాలో NZ 3-0 తేడాతో సిరీస్ గెలిచింది. గెలిచేందుకు 20 వికెట్లు తీయాలి. మా పేసర్లకు ఆ సత్తా ఉంది. గెలవాలనే మైండ్ సెట్‌తోనే ఇండియా టూరుకు వెళ్తాం’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. IND, WI మధ్య అక్టోబర్ 2 నుంచి తొలి టెస్ట్, 10 నుంచి రెండో టెస్ట్ జరగనుంది.

News September 19, 2025

ముగిసిన క్యాబినెట్ భేటీ.. కీలక బిల్లులకు ఆమోదం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ భేటీ ముగిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే దాదాపు 13 బిల్లులకు ఆమోదం తెలిపింది. వాహనమిత్ర కింద ఆటో/క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేలు అందించే పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని పరిధిలో 343 ఎకరాల భూసేకరణకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అటు నాలా ఫీజు రద్దు చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన బిల్లును ఆమోదించింది.

News September 19, 2025

వాహనదారులకు గుడ్ న్యూస్.. గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు

image

AP: పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మోటార్ వాహనాల చట్టంలో సవరణ చేస్తూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సభలో బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లుకు ఆమోదం లభించడంతో ఓల్డ్ వెహికల్స్‌పై గ్రీన్ ట్యాక్స్ రూ.20 వేల నుంచి రూ.3వేలకు తగ్గనుంది.