News March 16, 2024

తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పలేదు: ఈడీ

image

కవితను అక్రమంగా అరెస్ట్ చేశారన్న ఆమె లాయర్ వాదనలపై ఈడీ లాయర్లు తమ వాదనలు వినిపిస్తున్నారు. ‘మీడియాలో వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకోవద్దు. సెప్టెంబర్ 15 నుంచి 10 రోజులు సమన్లు ఇవ్వం అని మాత్రమే చెప్పాం. విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని ఏఎస్జీ చెప్పారు. వేరేవారికి ఇచ్చిన ఉత్తర్వులను మీకు అన్వయించుకోవద్దు. తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదు’ అని జడ్జికి విన్నవించారు.

Similar News

News November 22, 2024

తెలుగు రాష్ట్రాలు గజగజ

image

తెలుగు రాష్ట్రాల్లో చలి విజృంభిస్తోంది. ఏపీలోని పాడేరు ఏజెన్సీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. మినములూరులో అత్యల్పంగా 9, అరకులో 10, పాడేరు 11 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అటు తెలంగాణలోని ఆదిలాబాద్ ఏజెన్సీలోనూ చలి చంపేస్తోంది. సిర్పూర్(యు)లో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

News November 22, 2024

STOCK MARKETS: నిన్న బేర్ పంజా.. నేడెలా ఉంటాయో!

image

అదానీపై US కోర్టు అభియోగాల దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న విలవిల్లాడాయి. భారీ నష్టాల్లో ముగిశాయి. ఆ ప్రభావం నేడూ ఉంటుందా అని ఇన్వెస్టర్లు సందేహిస్తున్నారు. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్సే అందుతున్నాయి. ఆసియా సూచీలూ జోరు ప్రదర్శిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 70 పాయింట్ల మేర పెరగడం శుభసూచకం. రష్యా ICBM దాడి ప్రభావం ఉంటుందేమో చూడాలి. మరి సెన్సెక్స్, నిఫ్టీ ఎలా ఓపెనవుతాయంటారు?

News November 22, 2024

క్రికెట్ కలిపింది ఇద్దరినీ: మోదీ

image

భారత్, గయానా బంధాన్ని క్రికెట్, కల్చర్, కుసైన్ మరింత గాఢంగా మార్చాయని PM మోదీ అన్నారు. అక్కడి భారతీయులు, క్రికెటర్లతో మాట్లాడారు. ‘క్రికెట్‌పై ప్రేమ మన రెండు దేశాల్ని బలంగా కలుపుతోంది. అది ఆటే కాదు ఓ జీవన విధానం. అది మనకు గుర్తింపునిచ్చింది. రెండు దేశాల దినుసులు కలిపిచేసే ఇండో గయానిస్ వంటలు ప్రత్యేకం. దాల్‌పూరి ఇక్కడ ఫేమస్. నాకు చక్కని ఆతిథ్యం అందించిన ప్రెసిడెంట్ అలీకి థాంక్స్’ అని అన్నారు.