News December 13, 2024
అల్లు అర్జున్‌కు కోర్టు కీలక ఆదేశాలు

సుదీర్ఘ వాదనల అనంతరం అల్లు అర్జున్‌కు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు సొంత పూచీకత్తు సమర్పించాలని ఆయనను ఆదేశించింది. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలంది. తదుపరి విచారణను JAN 11కు వాయిదా వేసింది. అలాగే క్వాష్ పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ ఘటనలో సంధ్య థియేటర్ యాజమాన్యానికి ఇవే ఆదేశాలు వర్తిస్తాయని కోర్టు పేర్కొంది.
Similar News
News January 2, 2026
దుగ్గరాజపట్నం పోర్టుకు మహర్దశ

దుగ్గరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు, జాతీయ మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టును AP మారిటైమ్ బోర్డు చేపట్టనుంది. ప్రాజెక్టు కోసం 2 వేల ఎకరాల భూసేకరణ చేపట్టనున్నారు. తొలి దశలో ఏడాదికి 0.5 మిలియన్ గ్రాస్ టన్నేజ్ సామర్థ్యంతో షిప్‌యార్డు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో నౌకా నిర్మాణ రంగం విస్తరించి, భారీగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
News January 2, 2026
కనురెప్పలకూ చుండ్రు

శీతాకాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొందరిలో చుండ్రు కనురెప్పలపై కూడా ఏర్పడుతుంది. దీనివల్ల కళ్లు ఎర్రబడటం, లాషెస్ ఊడిపోవడంతో పాటు కండ్లకలక, కార్నియా వాపు వంటి సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. ఇలా కాకుండా ఉండాలంటే రాత్రి పడుకొనే ముందు కనురెప్పలకు గోరువెచ్చటి బాదం నూనె రాసి మర్దనా చెయ్యాలి. అలాగే కొబ్బరి నూనె, అలోవెరా జెల్ కలిపి రాసినా ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.
News January 2, 2026
ఐఐటీ జమ్మూలో నాన్ టీచింగ్ పోస్టులు

<


