News April 8, 2024
CA పరీక్షల వాయిదాకు కోర్టు నో
చార్టెర్డ్ అకౌంటెన్సీ (CA) పరీక్షలు వాయిదా వేయాలన్న విద్యార్థుల పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పరీక్షలను జూన్‌లో నిర్వహించాలని కొంత మంది సీఏ విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో షెడ్యూల్ ప్రకారమే మే నెలలో సీఏ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
Similar News
News January 9, 2025
బిగ్‌బాస్ 18కు చాహల్, శ్రేయస్ అయ్యర్?
బిగ్ బాస్ 18లో టీమ్ ఇండియా క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, శ్రేయస్ అయ్యర్‌తోపాటు శశాంక్ సింగ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సండే ఈవెంట్‌లో వీరు సందడి చేస్తారని సమాచారం. వీరు ముగ్గురూ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ధనశ్రీ, చాహల్ విడాకులకు శ్రేయస్ అయ్యర్ కారణమంటూ కొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి ఈ కార్యక్రమానికి హాజరుకావడం ఆసక్తిగా మారింది.
News January 9, 2025
బకరాను వదిలి పెద్ద పులులను పట్టుకోండి: బీవీ రాఘవులు
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఓ డీఎస్పీని బకరా చేస్తున్నారని CPM పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. బకరాను వదిలి పెద్ద పులులను పట్టుకోవాలన్నారు. ఈ ఘటనపై విచారణ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. పీఎం మోదీ విశాఖకు వస్తే పోలీసులంతా అక్కడే మోహరించారని, 10 లక్షల మంది భక్తుల ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించారు. ఘటనపై సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కూడా సమాధానం చెప్పాలన్నారు.
News January 9, 2025
ఇండియా కూటమిని మూసేయండి: ఒమర్ అబ్దుల్లా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా కూటమిలో విభేదాలను మరింత పెంచాయి. నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా JK CM ఒమర్ అబ్దుల్లా తీవ్ర స్వరంతో మాట్లాడారు. లోక్‌సభ వరకే పరిమితం అనుకుంటే ఇండియా కూటమిని మూసేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి వ్యూహాలేమీ లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. INDIA కేవలం లోక్‌సభ వరకే పరిమితమన్న RJD నేత తేజస్వీ యాదవ్ వ్యాఖ్యలపై ఇలా స్పందించారు.