News September 28, 2024
నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బెంగళూరు చట్టసభ ప్రతినిధుల కోర్టు షాకిచ్చింది. ఆమెపై కేసు నమోదు చేయాలని తిలక్‌నగర్ పోలీసులను ఆదేశించింది. ఎన్నికల బాండ్ల పేరిట వ్యాపారవేత్తలను ఆమె బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని ఆదర్శ్ అయ్యర్ అనే వ్యక్తి తిలక్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, పోలీసులు తీసుకోలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించగా, FIR నమోదుకు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.
Similar News
News November 11, 2025
ఆరుద్రలో అడ్డెడు చల్లినా పుట్టెడు పంట

ఆరుద్ర కార్తె (జూన్ 22 నుంచి జూలై 5 వరకు ఉండే సమయం) అనేది వర్షాకాలం ప్రారంభంలో వ్యవసాయ పనులకు సరైన సమయం. ఈ కార్తెలో భూమిలో తగినంత తేమ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అడ్డెడు( తక్కువ పరిమాణంలో) విత్తనాలు చల్లినా, అవి బాగా మొలకెత్తి పుట్టెడు(ఎక్కువ) పంటను ఇస్తాయని రైతుల విశ్వాసం. ఈ సామెత ఆరుద్ర కార్తెలో విత్తనాలు వేయడం, అప్పటి వర్షాలు.. పంటకు ఎంత అనుకూలంగా ఉంటాయో తెలియజేస్తుంది.
News November 11, 2025
హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి?

హనుమంతుని పూజతో భూతప్రేత పిశాచ భయాలు తొలగి, శని ప్రభావం వల్ల కలిగే బాధలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం వలన మంచి బుద్ధి, ధైర్యం, కీర్తి లభిస్తాయని నమ్మకం. ఆయనకు ఇష్టమైన అరటి, మామిడి పండ్లను నివేదించి, పూజించడం వల్ల చేపట్టిన కార్యాలు త్వరగా పూర్తై, మనసులోని కోరికలు నెరవేరుతాయట. ‘సంతానం కోసం ఎదురుచూసే దంపతులు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం’ ఉత్తమం అని పండితులు చెబుతున్నారు.
News November 11, 2025
శ్రద్ధ తీసుకోకనే అందెశ్రీ చనిపోయారు: వైద్యులు

TG: ప్రజా కవి అందెశ్రీ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోకపోవడం వల్లనే మరణించారని వైద్యులు తెలిపారు. నెల రోజులుగా బీపీ టాబ్లెట్స్ తీసుకోకపోవడం వల్లనే గుండెపోటు వచ్చిందని చెప్పారు. మూడు రోజుల నుంచి అనారోగ్యంగా ఉన్నా ఆసుపత్రికి వెళ్లలేదని తెలిపారు. కాగా ఆయన అంత్యక్రియలు ఇవాళ ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్లో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరై నివాళులర్పించనున్నారు.


