News April 4, 2025
దక్షిణ కొరియా అధ్యక్షుడిని తొలగించిన కోర్టు

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను పదవి నుంచి అధికారికంగా తొలగిస్తూ ఆ దేశ రాజ్యాంగ కోర్టు తాజాగా తీర్పుచెప్పింది. గత ఏడాది డిసెంబరులో ఆయన బలవంతంగా దేశంలో మార్షల్ లా అమలుచేసేందుకు విఫల యత్నం చేశారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో ఆయనపై ఆ దేశ పార్లమెంటులో అభిశంసన జరిగింది. తాజాగా ఆ అభిశంసనను సమర్థిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రజలనుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News April 11, 2025
విడిపోయినా కో-పేరెంటింగ్ చేస్తున్న సమంత, చైతూ!

వివాహ బంధానికి విడాకులతో వీడ్కోలు పలికిన సమంత, చైతూ తమ పెంపుడు కుక్కకు మాత్రం కో-పేరెంట్స్‌గా కొనసాగుతున్నారని ఓ రెడిట్ యూజర్ పోస్ట్ చేశాడు. ‘విడాకులకు ముందే హ్యాష్ అనే శునకాన్ని సామ్ దత్తత తీసుకున్నారు. డివోర్స్ అనంతరం చైతూ వద్ద కూడా అది కనిపించింది. వారు దానికి కో-పేరెంటింగ్ చేస్తున్నట్లున్నారు’ అని రాసుకొచ్చాడు. మనుషులు విడిపోయినా మూగ జీవాలను దూరం చేసుకోవద్దని నెటిజన్లు అంటున్నారు.
News April 11, 2025
అమెరికాపై 125% టారిఫ్ విధించిన చైనా

అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్ మరింత ముదురుతోంది. అమెరికాకు కౌంటర్‌గా చైనా సుంకాలు పెంచింది. నిన్న చైనా ఉత్పత్తులుపై అమెరికా 145% టారిఫ్ విధించగా ఇవాళ చైనా 125% సుంకం విధించింది. డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా బెదిరించాలని చూస్తున్నారని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు యూరోపియన్ యూనియన్ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
News April 11, 2025
అకౌంట్లోకి రూ.20,000.. కీలక ప్రకటన

AP: దేశంలో ఎక్కడా లేని విధంగా తాము పెన్షన్లు అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనం కింద అర్హులైన వారికి రూ.15వేలు అందిస్తామన్నారు. మే నుంచి రైతులకు విడతల వారీగా రూ.20వేలు(కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి) ఇస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.