News March 26, 2025
‘కోర్ట్’: USలోనూ అదిరిపోయే కలెక్షన్లు

నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రామ్ జగదీశ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘కోర్ట్’ సినిమా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.50+ కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఓవర్సీస్లోనూ దూసుకెళ్తోంది. అమెరికా గడ్డపై $1 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసినట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. కంటెట్ ఉన్న సినిమాలను ప్రజలు ఆదరిస్తారని మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. OTT రిలీజ్‌కు కాస్త టైమ్ పట్టొచ్చని సినీవర్గాలు తెలిపాయి.
Similar News
News March 26, 2025
ఇఫ్తార్ విందును బహిష్కరించాలని పిలుపు

AP: రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందును బహిష్కరించాలని పలు ముస్లిం సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండటాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయానికి వచ్చాయి. ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభ్యులు డిమాండ్ చేశారు. రేపు ఇఫ్తార్ విందును బహిష్కరించడమే కాకుండా ఈ నెల 29న ధర్నా చౌక్‌లో భారీ నిరసనకు పిలుపునిచ్చారు.
News March 26, 2025
చాహల్-ధనశ్రీ విడాకులకు కారణమిదేనా?

టీమ్ ఇండియా క్రికెటర్ చాహల్-ధనశ్రీవర్మ విడాకులకు ఓ బలమైన కారణమున్నట్లు తెలుస్తోంది. పెళ్లైనప్పటి నుంచి ధనశ్రీ హరియాణాలోని చాహల్ ఇంట్లో ఉంటున్నారు. ఈవెంట్స్ ఉన్నప్పుడు ముంబైకి వెళ్లి వస్తూ ఉంటారు. కానీ అటు ఇటు తిరగలేక ఆమె ముంబైలో వేరుకాపురం పెడదామని చాహల్‌ను కోరగా ఒప్పుకోలేదట. తన తల్లిదండ్రులతోనే కలిసి ఉండాలని ఆయన తేల్చిచెప్పారు. దీనిపైనే వీరి మధ్య విభేదాలు తలెత్తి విడాకులకు దారితీసిందని సమాచారం.
News March 26, 2025
కోడిగుడ్డు వెజ్జా.. నాన్ వెజ్జా?

ఇదేం ప్రశ్న అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. కానీ చాలా మంది గుడ్డును నాన్ వెజ్‌గా పరిగణించడం లేదు. శాకాహారులమని, ఎగ్ తమ మెనూలో భాగమని చెబుతుంటారు. అండం ఫలదీకరణం చెందని కారణంగా అది మాంసాహారం కిందికి రాదనేది వారి వాదన. కానీ మరో జీవి నుంచి ఉత్పత్తి అయింది కాబట్టి గుడ్డు మాంసాహారమేనని పరిశోధకులు చెబుతున్నారు. ఏదేమైనా పోషకాల్లో మాత్రం గుడ్డు వెరీ గుడ్ అని, రోజుకో ఎగ్ తినడం మేలని పేర్కొంటున్నారు.