News November 25, 2024

ఉద్యోగం నుంచి తొలగించినందుకు పరిహారం చెల్లించాలన్న కోర్టు!

image

చైనాకు చెందిన ఓ కెమికల్ కంపెనీలో పనిచేసే జాంగ్ అనే ఉద్యోగి ఆఫీసులో పడుకున్నాడని యాజమాన్యం అతణ్ని తొలగించింది. దీంతో అతను కోర్టును ఆశ్రయించారు. అతను 20 ఏళ్లుగా మంచి పనితీరు కనబరిచారని, ముందు రోజు ఆఫీసులో లేట్ అవడంతో పడుకున్నట్లు కోర్టు గుర్తించింది. ఈక్రమంలో అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు జాంగ్‌కు కంపెనీ 3,50,000 యువాన్‌లు(రూ.40.7 లక్షలు) పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

Similar News

News November 13, 2025

పాలమూరు: జాబ్ మేళా..70 మంది హాజరు

image

మహబూబ్ నగర్‌లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం (పిల్లలమర్రి)లో ఇవాళ మినీ జాబ్ మేళా నిర్వహించామని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రిప్రియ Way2Newsతో తెలిపారు. 5 ప్రైవేట్ సంస్థలలో మొత్తం 385 ఉద్యోగ ఖాళీల కోసం వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 70 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. వారిలో షార్ట్ లిస్టు తీసి.. అర్హులైన విద్యార్థులకు ఆఫర్ లెటర్ అందించినట్లు పేర్కొన్నారు.

News November 13, 2025

ఢిల్లీ పేలుడు: ఈ లేడీ డాక్టర్‌తో ఆ కిలేడీకి సంబంధాలు!

image

ఢిల్లీ పేలుడు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన Dr షహీన్‌కు పుల్వామా మాస్టర్‌మైండ్ ఉమర్ ఫరూఖ్‌ భార్య అఫీరాతో సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. అఫీరా, మసూద్ అజార్ చెల్లెలు సాదియా కలిసి షహీన్‌ను సంప్రదించినట్లు దర్యాప్తు వర్గాలు చెప్పాయి. భారత్‌లో జైషే మహిళా వింగ్‌ ఏర్పాటు చేసి మహిళలను రిక్రూట్ చేయాలని చెప్పినట్లు తెలిపాయి. 2019లో ఎన్‌కౌంటర్‌లో ఉమర్ హతమయ్యాడు.

News November 13, 2025

రేపే ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

image

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. దాంతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రిజల్ట్ రాబోతోంది. మీరెంతో అభిమానించే Way2News ఉ.8 గంటల నుంచే కౌంటింగ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతుంది. వేగంతో పాటు స్పెషల్ గ్రాఫిక్ ప్లేట్లతో ఫలితాల వివరాలను వెల్లడిస్తుంది.