News March 6, 2025

రాహుల్‌పై కోర్టు ఆగ్రహం.. జరిమానా ఎంతంటే?

image

లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో‌కోర్టు రూ.200 జరిమానా విధించింది. సావర్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే వేరే కార్యక్రమాలు ఉన్నందున రాలేరని రాహుల్ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో కోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 14న తప్పనిసరిగా హాజరుకావాలని లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేసింది.

Similar News

News March 6, 2025

ఇకపై ‘మనమిత్ర’లో 200 సేవలు: లోకేశ్

image

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’లో ఇకపై ప్రజలకు 200 సేవలు అందుతాయని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘మన మిత్ర’ అద్భుత మైలురాయి దాటిందన్నారు. ఈ ఏడాది జనవరిలో 161 సేవలతో ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ గవర్నెన్స్‌కు ఇదో నిదర్శనం అని లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు.

News March 6, 2025

ఏపీలో ‘ఛావా’ సినిమాపై వివాదం

image

‘ఛావా’ సినిమాను ఏపీలో రిలీజ్ చేయొద్దని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఏపీ ప్రెసిడెంట్ మహ్మద్ జియా ఉల్ హక్ డిమాండ్ చేశారు. ఈ మూవీలో చరిత్రను వక్రీకరించారని, రిలీజ్‌ను ఆపాలని నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం ఇచ్చారు. ఇందులో ముస్లింలను తప్పుగా చూపారని ఆయన ఆరోపించారు. మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వెర్షన్ రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది.

News March 6, 2025

‘ప్యారడైజ్’లో నాని లుక్ వెనుక కథ ఇదే!

image

‘ప్యారడైజ్’ టీజర్‌లో నేచురల్ స్టార్ నాని ఊరమాస్ లుక్‌తో పాటు జడలు వేసుకొని కనిపించారు. అందరినీ ఆకర్షించిన ఆ లుక్‌పై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల స్పందించారు. రెండు జడలకు, తన బాల్యానికి కనెక్షన్ ఉందని చెప్పారు. చిన్నప్పుడు తనను తల్లి అలాగే జడలు వేసి పెంచిందని, ఆ స్ఫూర్తితోనే నాని పాత్రను డిజైన్ చేశానని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ప్యారడైజ్’ మూవీ 2026 మార్చిలో విడుదల కానుంది.

error: Content is protected !!