News March 16, 2024
ఈవీఎంలపై ఫిర్యాదులను కోర్టులు 40సార్లు కొట్టేశాయి: సీఈసీ

ప్రతి ఎన్నికలో ఈవీఎంల పనితీరుపై పలువురు వ్యక్తం చేస్తోన్న అనుమానాలపై సీఈసీ రాజీవ్ కుమార్ స్పందించారు. ‘ఇలాంటి ఫిర్యాదులపై కోర్టులు 40సార్లు విచారణ చేశాయి. ప్రతిసారీ ఆరోపణలన్నీ తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికల ప్రక్రియను ఈవీఎంలు సరళతరం చేశాయి. అవే ఈవీఎంలతో అధికారంలో ఉన్న పార్టీలూ ఓడిపోయాయి’ అని గుర్తు చేశారు.
Similar News
News October 14, 2025
శుభ సమయం (14-10-2025) మంగళవారం

✒ తిథి: బహుళ అష్టమి సా.4.05 వరకు
✒ నక్షత్రం: పునర్వసు సా.5.24 వరకు
✒ శుభ సమయం: ఏమీ లేవు
✒ రాహుకాలం: మ.3.00-సా.4.30
✒ యమగండం: ఉ.9.00-ఉ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, రా.10.48-రా.11.36
✒ వర్జ్యం: శే.ఉ.7.23 వరకు, పునః రా.1.10-రా.2.43
✒ అమృత ఘడియలు: మ.3.06-మ.4.38 * ప్రతిరోజూ పంచాంగం, <<-1>>రాశిఫలాల<<>> కోసం క్లిక్ చేయండి.
News October 14, 2025
TODAY HEADLINES

* మోదీతో చంద్రబాబు భేటీ.. కర్నూలు, విశాఖకు ఆహ్వానం
* సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు హెల్త్ చెకప్లు: సీఎం రేవంత్
* అమరావతిలో CRDA భవనాన్ని ప్రారంభించిన చంద్రబాబు
* కరూర్ తొక్కిసలాటపై CBI విచారణ: సుప్రీంకోర్టు
* ఇజ్రాయెల్ బందీల విడుదల.. ట్రంప్, నెతన్యాహును ప్రశంసించిన మోదీ
* AP: సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
News October 14, 2025
LOC వెంబడి ఉగ్రమూక చొరబాటు యత్నం!

జమ్మూకశ్మీర్లోని కుప్వారా సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని ఇండియన్ ఆర్మీ భగ్నం చేసినట్లు తెలుస్తోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్థాన్ వైపు నుంచి కొన్ని అనుమానాస్పద కదలికలను భారత ఆర్మీ గుర్తించింది. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో అటుగా జవాన్లు కాల్పులు జరిపారు. పాక్ వైపు నుంచి సరిహద్దు దాటే ప్రయత్నం జరిగినట్లు ఆర్మీ భావిస్తోంది. ప్రస్తుతం ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.