News December 5, 2024
కొవిడ్ వైరస్ మెదడులోనే నాలుగేళ్లు ఉంటుంది: పరిశోధకులు
కొవిడ్ బాధితుల తలలో ఆ వైరస్ కనీసం నాలుగేళ్లు ఉంటుందని జర్మనీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘సెల్ హోస్ట్ అండ్ మైక్రోబ్’ అనే జర్నల్‌లో ఆ వివరాలను ప్రచురించారు. ‘మెదడులోని పొరల్లో వైరస్ తాలూకు స్పైక్ ప్రొటీన్ ఉండిపోతుంది. దీంతో నరాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. మెదడు పనితీరు వేగంగా మందగిస్తుంది. కొవిడ్ బాధితుల్లో 5 నుంచి 10శాతం రోగుల్లో అస్వస్థత కనిపిస్తుంది’ అని వివరించారు.
Similar News
News December 5, 2024
ఈ నెలలోనే క్యాబినెట్ విస్తరణ?
TG: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఈ నెలలోనే ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి AICC కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో TPCC ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించి మంత్రివర్గ సభ్యుల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. క్యాబినెట్లో 6 ఖాళీలు ఉండగా తీవ్ర పోటీ నెలకొంది. చాలా మంది MLAలు ఆశలు పెట్టుకున్నారు. టీపీసీసీ నూతన కార్యవర్గం కూడా ఏర్పాటవుతుందని తెలుస్తోంది.
News December 5, 2024
నేడు టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
AP: ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇవాళ జరగనుంది. ఈ ఎన్నికల్లో 16,737 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు చేపడతారు. కాగా యూటీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.
News December 5, 2024
మంచు దుప్పటిలా మారిన లార్డ్స్ స్టేడియం
క్రికెట్ మక్కాగా పిలుచుకునే లార్డ్స్ మైదానం మంచుతో నిండిపోయింది. మైదానం మొత్తం మంచు దుప్పటి పరచినట్లుగా మారింది. దీంతో స్టేడియం అందాలు రెట్టింపు అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా క్రిస్మస్కు ముందు ఇంగ్లండ్‌లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో మంచు కూడా అధికంగా పడుతుంటుంది.