News May 2, 2024
కొవిషీల్డ్ సురక్షితమే.. ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా
కొవిషీల్డ్ వ్యాక్సిన్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా పేర్కొంది. కాగా.. ఈ వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఇటీవల ఆస్ట్రాజెనెకా అంగీకరించడంతో టీకా తీసుకున్న వారిలో ఆందోళన మొదలైంది. తాజాగా ఈ విషయంపై ఆస్ట్రాజెనెకా మళ్లీ స్పందించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రయోగ పరీక్షల్లో కొవిషీల్డ్ మంచి ఫలితాలు ఇచ్చిందని పేర్కొంది.
Similar News
News December 25, 2024
ఇంటర్ అమ్మాయి ఆత్మహత్య
తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా హనుమకొండలోని ఏకశిలా కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని గుగులోతు శ్రీదేవి (16) నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంది. శ్రీదేవి అనారోగ్యం కారణంగానే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యాసంస్థల్లో ఓ వైపు ఫుడ్ పాయిజన్, మరోవైపు ఆత్మహత్యలు చర్చనీయాంశంగా మారాయి.
News December 25, 2024
మళ్లీ జోరు పెంచిన BITCOIN
క్రిప్టో కరెన్సీ మార్కెట్లు గత 24 గంటల్లో పరుగులు పెట్టాయి. టాప్ 10 కాయిన్లు భారీ లాభాల్లో ట్రేడయ్యాయి. బిట్‌కాయిన్ ఏకంగా 3.99% పెరిగింది. $3789 లాభంతో $98,663 వద్ద ముగిసింది. నేడు $489 నష్టంతో $98,412 వద్ద కొనసాగుతోంది. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ 2.30% లాభంతో $3,485 వద్ద ట్రేడవుతోంది. XRP 1.46, BNB 1.75, SOL 4.30, DOGE 3.39, ADA 1.30, TRON 1.75, AVAX 5.90, LINK 2.68, SHIP 3.59% మేర ఎగిశాయి.
News December 25, 2024
టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్(ITBP)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. 7 హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్), 44 కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) పోస్టులు భర్తీ చేయనున్నారు. 18-25 వయస్సు, ఆసక్తి కలిగిన పురుషులు వచ్చే ఏడాది జనవరి 22లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్, కానిస్టేబుల్ పోస్టులకు టెన్త్ పాసై ఉండాలని బోర్డు తెలిపింది. అదనపు వివరాల కోసం ఇక్కడ <