News October 12, 2025
CP సజ్జనార్‌తో మెగాస్టార్ చిరంజీవి

నగరానికి నూతన CPగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్‌ను ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో CPతో భేటీ అయ్యారు. ఇరువురి మీటింగ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Similar News
News October 12, 2025
జో బైడెన్‌కు రేడియేషన్ థెరపీ

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ 82 ఏళ్ల వయసులో ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆయనకు ప్రస్తుతం వైద్యులు రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ‘జో బైడెన్ అగ్రెసివ్ ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అది ఆయన ఎముకలకు పూర్తిగా పాకింది’ అని ఈ ఏడాది మే నెలలో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
News October 12, 2025
‘PM మీరు చాలా గ్రేట్’.. మోదీకి ట్రంప్ మెసేజ్

అమెరికా రాయబారి సెర్గియో గోర్ PM మోదీని కలిశారు. ఆ సమయంలో మోదీ, US అధ్యక్షుడు ట్రంప్ కలిసున్న ఫొటోను బహూకరించారు. దానిపై ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మీరు చాలా గ్రేట్’ అని రాసిన ఒక స్పెషల్ నోట్ ఉంది. అలాగే సెర్గియో కూడా భేటీ అనంతరం ట్రంప్‌కు PM మోదీ ‘గ్రేట్ పర్సనల్ ఫ్రెండ్’ అని పేర్కొన్నారు. ఆయన విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశీ కార్యదర్శి మిస్రీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్‌నూ కలిశారు.
News October 12, 2025
NLG: మద్యం దుకాణాలకు 163 దరఖాస్తులు

నల్గొండ జిల్లాలో మద్యం దుకాణాలకు శనివారం మరో 67 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా.. నేటి వరకు 163 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. .