News September 22, 2025
ఎల్లుండి విజయవాడకు సీపీ రాధాకృష్ణన్

AP: నూతన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఎల్లుండి విజయవాడలో పర్యటించనున్నారు. తొలుత ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అనంతరం పున్నమిఘాట్‌లో జరిగే ‘విజయవాడ ఉత్సవ్’లో పాల్గొంటారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయం తెలిపింది. ఇటీవల సీపీ రాధాకృష్ణన్‌ను కలిసిన ఎంపీ, విజయవాడ ఉత్సవ్‌కు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆ మేరకు ఆయన విచ్చేయనున్నారు.
Similar News
News January 29, 2026
ప్రధానిగా మోదీనే బెస్ట్: ఇండియా టుడే సర్వే

భారత ప్రధానిగా మోదీనే బెస్ట్ అని 55 శాతం మంది భావించినట్లు Mood of the Nation సర్వేలో ఇండియా టుడే వెల్లడించింది. 6 నెలల కిందటితో పోలిస్తే 3% పెరిగినట్లు తెలిపింది. మోదీ పనితీరుపై 57% మంది సంతృప్తి వ్యక్తం చేశారని, గుడ్ రేటింగ్ ఇచ్చారని వివరించింది. యావరేజ్ అని 16%, పూర్ అని 24% మంది అభిప్రాయపడ్డారని చెప్పింది. మరోవైపు బెస్ట్ సూటెడ్ PM అంటూ రాహుల్ గాంధీ వైపు 27% మంది మొగ్గు చూపినట్లు పేర్కొంది.
News January 29, 2026
పాకిస్థాన్‌కు అంత దమ్ము లేదు: రహానే

T20 ప్రపంచ కప్‌ను బాయ్‌కాట్ చేస్తామంటూ బెదిరిస్తున్న పాకిస్థాన్‌పై భారత క్రికెటర్ అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ అలా చేస్తుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఆ జట్టుకు అంత దమ్ము లేదన్నారు. టోర్నీ ఆడేందుకు పాక్ వస్తుందని అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్ కోసం శ్రీలంకలోని కొలంబోకు వెళ్లేందుకు పాకిస్థాన్ టీమ్ టికెట్లు బుక్ <<18990370>>చేసుకున్నట్లు<<>> వార్తలు రావడం తెలిసిందే.
News January 29, 2026
ఎన్నికలు జరిగితే NDAకు 352 సీట్లు: ఇండియా టుడే సర్వే

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే NDAనే గెలుస్తుందని Mood of the Nation సర్వేలో ఇండియా టుడే వెల్లడించింది. NDAకు 352 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ‘ఇండీ’ కూటమి 182 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. బీజేపీకి 41 శాతం(287 సీట్లు), కాంగ్రెస్‌కు 20 శాతం(80 సీట్లు), మిగతా పార్టీలకు 39 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.


