News August 9, 2024
CPGET-2024 ఫలితాలు విడుదల

తెలంగాణలోని పలు యూనివర్సిటీల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంపీఎడ్ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించిన CPGET-2024 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. జులై 6 నుంచి 16వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు 73,342 మంది దరఖాస్తు చేసుకోగా, 64,765 మంది హాజరయ్యారు. ఫలితాల కోసం ఇక్కడ <
Similar News
News December 22, 2025
వంటింటి చిట్కాలు మీకోసం

* పంచదార డబ్బాలో కొన్ని లవంగాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి.
* అల్లం, వెల్లుల్లి ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే పేపర్ బ్యాగ్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
* పెనాన్ని రెండు గంటలపాటు వేడినీటిలో ఉంచి తర్వాత నిమ్మ చెక్కతో రుద్దితే జిడ్డు వదిలి పోతుంది.
* గారెలు, బూరెలు వంటివి చేసేటప్పుడు నూనె చిందకుండా ఉండాలంటే నూనెలో కాస్త నెయ్యి వేస్తే సరిపోతుంది.
News December 22, 2025
‘ధురంధర్’ కలెక్షన్లు ఎంతో తెలుసా?

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురందర్’ మూవీ కలెక్షన్లలో దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటివరకు రూ.790.75 కోట్లు వసూలు చేసినట్లు INDIA TODAY తెలిపింది. ఇవాళ రూ.800 కోట్లు క్రాస్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు కేవలం ఇండియాలోనే ఈ మూవీ రూ.555.5 కోట్ల నెట్ సాధించినట్లు వెల్లడించి. దీంతో యానిమల్ లైఫ్ టైమ్ కలెక్షన్ల(రూ.553 కోట్లు)ను దాటేసిందని పేర్కొంది.
News December 22, 2025
గాలిలో ఉండగా ఆగిన విమానం ఇంజిన్

ఢిల్లీ నుంచి ముంబైకి బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇవాళ ఉ.6.10 గంటలకు టేకాఫ్ కాగా కొద్దిసేపటికే కుడి వైపు ఇంజిన్ ఆగిపోయింది. దీంతో వెంటనే పైలట్లు అప్రమత్తమై విమానాన్ని తిరిగి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేసింది.


