News August 10, 2024

ఈ నెల 12 నుంచి CPGET కౌన్సెలింగ్

image

TG: సీపీగెట్-2024 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 21 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగనుంది. సవరణలకు 26 వరకు అవకాశమివ్వగా 27 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ ఇచ్చారు. SEP 4న మొదటి ఫేజ్ సీట్లను అలాట్ చేయనున్నారు. అదే నెల 9న విద్యార్థులు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టు చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్ వెరిఫికేషన్ SEP 15న మొదలుకానుంది.

Similar News

News January 18, 2025

సంజయ్‌ను ఉరి తీయండి: ప్రజల నినాదాలు

image

అభయ హత్యాచార కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌ను ఉరి తీయాలని కోర్టు బయట మెడిసిన్ విద్యార్థులు, ప్రజలు నినాదాలు చేశారు. ఇలా అయితేనే మరొకరు ఇలాంటి దారుణాలకు పాల్పడేందుకు భయపడతారని అన్నారు. కాగా కేసు తీవ్రత దృష్ట్యా ఈ మధ్యాహ్నం భారీ బందోబస్తు మధ్య రాయ్‌ను కోర్టుకు తీసుకొచ్చారు. ప్రత్యేక బృందాలతో పాటు 300 మందికి పైగా పోలీసులు కోర్టు చుట్టూ మోహరించారు.

News January 18, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత జట్టు ప్రకటన

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు.
టీమ్: రోహిత్ శర్మ (C), గిల్(VC), జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, పంత్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్, బుమ్రా, షమీ, అర్ష్‌దీప్ సింగ్.

News January 18, 2025

నేను నేరం చేయలేదు: కోర్టులో సంజయ్

image

కోల్‌కతా హత్యాచార ఘటనలో దోషిగా కోర్టు నిర్ధారించిన <<14530358>>సంజయ్ రాయ్<<>> తాను నిర్దోషిని అని వాదించాడు. ఈ రోజు కోర్టు తీర్పు వెల్లడించే ముందు జడ్జితో ‘నేను ఈ నేరం చేయలేదు’ అని చెప్పాడు. గతంలో కూడా ఇతడు ఇదే తరహా కామెంట్లు చేశాడు. అటు అతడు ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని రాయ్ కుటుంబం పేర్కొంది. కోల్‌కతాలోని శంభునాథ్ స్లమ్‌లో ఒక గదిలో ఉండే వీరి కుటుంబం.. పోరాడే శక్తి సైతం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేసింది.