News September 12, 2025
CPL: చివరి బంతికి గెలిపించిన హోల్డర్

CPLలో సెయింట్ కిట్స్&నెవిస్ పాట్రియాట్స్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు. ఇన్నింగ్స్ చివరి బంతికి వికెట్ తీసి తన జట్టుకు విజయం కట్టబెట్టారు. తొలుత సెయింట్స్ కిట్స్ 20 ఓవర్లలో 150/7 పరుగులు చేసింది. హోల్డర్ 30 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 53 పరుగులు బాదారు. ఛేదనలో బార్బడోస్ రాయల్స్ 149/7కే పరిమితమైంది. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా డానియల్ సామ్స్‌ను హోల్డర్ ఔట్ చేశారు.
Similar News
News September 12, 2025
కొంతకాలం సోషల్ మీడియాకు దూరం: అనుష్క

సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉండనున్నట్లు టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి వెల్లడించారు. ‘నేను కొంత కాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి అనుకుంటున్నా. స్క్రోలింగ్‌ను పక్కన పెట్టి ప్రపంచంతో తిరిగి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే మనందరి వాస్తవ ప్రపంచం అదే. అతి త్వరలో మీతో మరిన్ని స్టోరీలు పంచుకుంటా. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తుంటా’ అని పోస్ట్ చేశారు. అనుష్క నటించిన ‘ఘాటీ’ ఇటీవలే విడుదలైంది.
News September 12, 2025
47 ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూతో ఎంపిక

రాంచీలోని MECON లిమిటెడ్‌లో 47 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో అడిషనల్ ఇంజినీర్, Dy.ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులున్నాయి. ఉద్యోగానుభంతోపాటు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 15, 16, 19, 20వ తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అప్లికేషన్ ఫామ్, ఇతర పూర్తి వివరాల కోసం <
News September 12, 2025
దేవుళ్లను పుష్పాలతో ఎందుకు పూజించాలి?

మన నిత్య పూజలలో పూలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే, పుష్పం మొదట్లో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, చివరన శివుడు కొలువై ఉంటారు. అలాగే దాని రేకలలో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. పుష్పాలలో నివసించే పరమాత్మ, పుష్పాలతోనే పూజ చేస్తే ప్రసన్నుడవుతాడు. అందుకే పూలను త్రివర్గ సాధనంగా చెబుతారు. పుష్పాలను దైవారాధనకు ఉపయోగించడం ద్వారా సంపద, మోక్షం వంటివి లభిస్తాయని నమ్మకం.