News May 22, 2024
సిట్ నివేదికను బయటపెట్టాలని సీపీఎం డిమాండ్

AP: పోలింగ్ తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ బృందం సమర్పించిన నివేదికను బహిర్గతం చేయాలని CPM రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పోలీసుల దర్యాప్తులో లోపాలున్నాయని సిట్ తేల్చిందన్నారు. FIRలలో మరికొన్ని సెక్షన్లు చేర్చాలని సిట్ ప్రతిపాదించనట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో నివేదికను బయటపెట్టాలని కోరారు. అప్పుడే పారదర్శకత పెరిగి, ప్రజలకు విశ్వాసం కలిగే అవకాశం ఉంటుందని అన్నారు.
Similar News
News November 29, 2025
‘దిత్వా’ తుఫాను.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: ‘దిత్వా’ తుఫాను ప్రభావంతో 3 రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. నేడు CTR, TPT, ప్రకాశం, NLR, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం నెల్లూరు, CTR, TPT, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉందని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
News November 29, 2025
బాలయ్య రోల్లో విజయ్ సేతుపతి!

రజినీకాంత్ ‘జైలర్-2’ సినిమాలో గెస్ట్ రోల్ కోసం మొదట బాలకృష్ణను తీసుకోవాలని అనుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బిజీ షెడ్యూల్ కారణంగా బాలయ్య ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్లేస్లో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి చేస్తున్నారని, ఇప్పటికే షూటింగ్లో కూడా పాల్గొన్నారని సమాచారం. నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2026 సమ్మర్లో విడుదల కానుంది.
News November 29, 2025
PHOTO: సిద్ద-శివ బ్రేక్ఫాస్ట్ మీట్

కర్ణాటకలో సీఎం మార్పు ప్రచారం వేళ సిద్దరామయ్య, డీకే శివకుమార్ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. సిద్ద ఆహ్వానం మేరకు శివకుమార్ ఆయన నివాసానికి వెళ్లారు. సీఎం, డిప్యూటీ సీఎం ఏం మాట్లాడుకున్నారనేది తెలియాల్సి ఉంది. సీఎం కుర్చీపై వారిద్దరే తేల్చుకోవాలంటూ కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేసింది. దీంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కుర్చీ వదులుకోవడానికి సిద్ద అంగీకరిస్తారా? లేదా అన్నది ఉత్కంఠగా మారింది.


