News July 25, 2024
కుప్పకూలిన విమానం.. మృత్యుంజయుడు

నిన్న నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందారు. కానీ ఆ విమానాన్ని నడుపుతున్న పైలట్ మనీశ్ శాక్య మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలవ్వగా ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా కాఠ్మండూ ఎయిర్‌పోర్ట్‌లో శౌర్య ఎయిర్‌లైన్ విమానం కూలిపోయేముందు ఓ కంటైనర్‌ను ఢీకొట్టింది. దీంతో కాక్‌పిట్ ఆ కంటైనర్‌లో ఇరుక్కుపోయింది. అందులో ఉన్న మనీశ్ తీవ్ర గాయాలైనా సజీవంగా బయటపడ్డారు.
Similar News
News November 20, 2025
పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయా? ఇలా తెలుసుకోండి!

నిన్న ప్రధాని మోదీ పీఎం కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున రూ.18వేల కోట్లు జమ చేశారు. భూమి వివరాలు PM-KISAN పోర్టల్‌లో నమోదై ఉండి, బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ అయి ఉన్న రైతులకే ఈ స్కీమ్ ప్రయోజనాలు అందనున్నాయి. https://pmkisan.gov.in/లోకి వెళ్లి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో, లేదో తెలుసుకోవచ్చు.
News November 20, 2025
దేశవ్యాప్తంగా సన్న బియ్యం ఇవ్వాలని కేంద్ర మంత్రికి CM విజ్ఞప్తి

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీకి CM రేవంత్ వివరించారు. HYDలో ఆయనతో సీఎం భేటీ అయ్యారు. ప్రజలు తినే బియ్యాన్ని సరఫరా చేస్తేనే సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని, దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ అంశాన్ని పరిశీలించాలని కోరారు. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు.
News November 20, 2025
హన్స్‌రాజ్ కాలేజీలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

హన్స్‌రాజ్ కాలేజీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో 24 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, Lab అసిస్టెంట్, Jr అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, Lab అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా, మిగతా పోస్టులకు 32ఏళ్లు. వెబ్సైట్: hansrajcollege.ac.in/


