News March 15, 2025
సిRAW: భావోద్వేగాలే.. బాగోగుల్లేవిక్కడ

ఎన్నికలంటే ఐదేళ్ల ప్రోగ్రెస్ కార్డుతో ప్రచారాలుండాలి. ఇటీవల పాలకులు ప్రాంతం, జాతి, మతం, భాష అని ఎమోషనల్ కార్డు ప్లే చేస్తున్నారు. భావోద్వేగ డ్రామాతో పోల్ ఘట్టం గట్టెక్కేస్తున్నారు. ప్రశ్నించాల్సిన విపక్షాలూ కుర్చీ కోసం ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. అని పండగ సేల్లా ఆఫర్లిస్తున్నాయి. ప్రజల కోసం ఫలానా చేశామని చెప్పట్లేదు. ఎవరికి పవర్ వచ్చినా ప్రసాదం తినలేని ప్రజాస్వామ్య దేవుళ్లకే ఎగనామం. ఏమంటారు ఫ్రెండ్స్?
Similar News
News November 23, 2025
పాడి పశువులకు ఈ లక్షణాలతో ప్రాణాపాయం

పాలజ్వరం అధిక పాలిచ్చే ఆవులు, గేదెల్లో ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన పశువులు సరిగా మేత మేయవు. నెమరు వేయక, బెదురు చూపులతో చికాకుగా ఉండి, వణుకుతూ కదలలేని స్థితిలో ఉంటాయి. సరిగా నిలబడలేవు. పశువులు తమ తలను పొట్టకు ఆనించి S ఆకారంలో మగతగా పడుకోవడం పాలజ్వరం ప్రధాన లక్షణం. వ్యాధి తీవ్రమైతే శ్వాస, నాడి వేగం పూర్తిగా పడిపోయి పశువులు మరణించే అవకాశం ఉంది. ఈ వ్యాధి నివారణ సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News November 23, 2025
నేడు భారత్ బంద్

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ను నిరసిస్తూ నేడు మావోయిస్టు పార్టీ భారత్ బంద్కు పిలుపునిచ్చింది. అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం విజయవాడకు వస్తే పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని మండిపడింది. బంద్ నేపథ్యంలో AOBలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వరకు నడిచే బస్సులను రద్దు చేశారు. ఆదివారం కావడంతో మైదాన ప్రాంతాల్లో బంద్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.
News November 23, 2025
భారీగా పెరుగుతున్న రెవెన్యూ లోటు

AP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భారీగా పెరుగుతోంది. 2025-26లో రూ.33,185 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేస్తే, OCT నాటికే రూ.47,805 కోట్లకు చేరినట్లు కాగ్ తన నివేదికలో వెల్లడించింది. రెవెన్యూ ఆదాయం రూ.2.17 లక్షల కోట్లుగా అంచనా వేస్తే రూ.91,638 కోట్లు వచ్చాయి. ప్రస్తుత FYలో రూ.79,927 కోట్ల అప్పులు చేయాల్సి ఉండగా, 7 నెలల్లోనే రూ.67,283 కోట్ల రుణాలు తీసుకుంది.


