News April 10, 2024

మూడో టర్మ్‌కు క్రేజ్ పెరుగుతోంది: మోదీ

image

ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి BJP విజయఢంకా మోగించే అవకాశాలపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సాధారణంగా రెండు టర్మ్‌లు ముగిసే సరికి ప్రభుత్వాలు మద్దతు కోల్పోతుంటాయి. ప్రపంచ దేశాల్లో ప్రభుత్వాలపై అసంతృప్తి అనేది కొంతకాలంగా కొనసాగుతోంది. అయితే భారత్ ఇందుకు మినహాయింపు. ఇక్కడ మా ప్రభుత్వం క్రేజ్ ఇంకా పెరుగుతోంది. ఈసారి 97కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు’ అని పేర్కొన్నారు.

Similar News

News March 5, 2026

సంజూ దూకుడు.. భారీ స్కోర్ దిశగా భారత్

image

T20WC: ఇంగ్లండ్‌పై సంజూ శాంసన్ దూకుడుగా ఆడుతున్నారు. ఇషాన్ కిషన్‌తో కలిసి సిక్సర్లు, బౌండరీలతో దుమ్మురేపుతున్నారు. పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసే సరికి భారత్ స్కోర్ 67/1గా ఉంది. అభిషేక్ 9 రన్స్ చేసి ఔటయ్యారు. సంజూ (40*), కిషన్ (16*) క్రీజులో ఉన్నారు. మరి 20 ఓవర్లలో టీమ్ ఇండియా ఎంత స్కోర్ చేస్తుందో కామెంట్ చేయండి.

News March 5, 2026

ఎక్కువ పిల్లల్ని కంటాం సరే.. ప్రభుత్వ సాయం ఏ మూలకు?

image

దేశంలో 1980-90s వరకు ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు మొగ్గుచూపేవారు. పెరిగిన ఖర్చులు, పేదరికంతో క్రమంగా ఒకరిద్దరు సంతానానికే పరిమితమయ్యారు. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యువతరం కొరత ఉంది. అందువల్ల ఎక్కువ మంది పిల్లలను కంటే ప్రోత్సాహకాలు ఇస్తామని AP CM CBN <<19304777>>ప్రకటించారు.<<>> అయితే విద్య, వైద్యం, కూడు, గూడు, గుడ్డ ఖరీదైన సమాజంలో ఈ సాయం ఏమాత్రం సరిపోతుందనేది అతిపెద్ద ప్రశ్న. మీరేమంటారు?

News March 5, 2026

అభిషేక్ మరోసారి ఫెయిల్

image

T20WCలో టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి ఫెయిల్ అయ్యారు. కీలకమైన సెమీఫైనల్లో రెండో ఓవర్లోనే భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చారు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ పైనా నిర్లక్ష్యపు షాట్ ఆడి 9 పరుగులకే ఔట్ కావడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఫైనల్‌కు వెళ్తే అతడిని పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ WCలో అభి 7 మ్యాచులు ఆడి 89 రన్స్ మాత్రమే చేశారు.