News January 14, 2025

క్రేజీ.. మహా కుంభమేళాలో ‘అఖండ-2’ షూట్

image

సంగీత దర్శకుడు తమన్ ‘అఖండ-2’ మూవీ గురించి అదిరిపోయే అప్టేడ్ ఇచ్చారు. యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాలో ఈ మూవీ షూటింగ్ జరగనుందని ట్వీట్ చేశారు. కాగా ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్ట్-1 సూపర్ హిట్ అవ్వగా పార్ట్-2పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన బాలయ్య ‘డాకు మహారాజ్’ పాజిటివ్ సొంతం చేసుకుంది.

Similar News

News December 1, 2025

మన ఎంపీలు గళమెత్తాల్సిన సమయం

image

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి కర్నూలు నుంచి బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కర్నూలు–నంద్యాల, కర్నూలు-మంత్రాలయం మధ్య నూతన రైల్వే లైన్ నిర్మాణం, ఆలూరు, ఆదోని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ కలుషితం సమస్యలు, మొక్కజొన్న పంటకు మద్దతు ధర, జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కేంద్ర ప్యాకేజీ అవసరంపై మన ఎంపీలు పార్లమెంట్‌లో గళమెత్తాల్సిన అవసరం ఉంది.

News December 1, 2025

కోహ్లీ 100 సెంచరీలు చేస్తారా?

image

SAపై నిన్న కోహ్లీ చెలరేగిన తీరు చూస్తే సచిన్ 100 సెంచరీల రికార్డును చేరుకోవడం కష్టం కాదేమో అని క్రీడా వర్గాల్లో టాక్ మొదలైంది. 2027 WCకు ముందు భారత్ ఇంకా 20 వన్డేలు ఆడనుంది. లీగ్‌లో ఫైనల్‌కు చేరితే మరో 5 నుంచి 10 మ్యాచులు ఆడే ఆస్కారం ఉంది. ప్రస్తుతం 83 శతకాలు బాదిన కోహ్లీ ఇక నుంచి ప్రతి 3 మ్యాచులకు 2 సెంచరీలు చేస్తే సచిన్ సరసన నిలిచే ఛాన్సుంది. మరి విరాట్ ఆ ఘనత సాధిస్తారా? మీ COMMENT.

News December 1, 2025

భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>NTPC<<>> 4 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బీఈ/బీటెక్, పీజీడీఎం/ఎంబీఏ ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. షార్ట్ లిస్టింగ్/స్క్రీనింగ్, రాత పరీక్ష/CBT, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.90వేలు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC,ST,PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in