News September 30, 2024

‘పుష్ప-3’ గురించి క్రేజీ న్యూస్!

image

పుష్ప-2 సినిమా ఎండింగ్‌లో మూడో పార్ట్ గురించి డైరెక్టర్ సుకుమార్ ఓ అదిరిపోయే లీడ్ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్‌లో ఓ పాపులర్ స్టార్ ఎంట్రీ ఇస్తారని, అది మూడో పార్ట్‌కు లీడ్‌గా మారుతుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాసిల్ తదితరులు నటిస్తున్న ‘పుష్ప-2’ డిసెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Similar News

News December 4, 2025

రైతన్నా.. పంట వ్యర్థాలను తగలబెట్టొద్దు

image

పంటకాలం పూర్తయ్యాక చాలా మంది రైతులు ఆ వ్యర్థాలను తగలబెడుతుంటారు. వీటిని తొలగించడానికి అయ్యే ఖర్చును భరించలేక ఇలా చేస్తుంటారు. అయితే దీని వల్ల నేల సారం దెబ్బతినడంతో పాటు పంటకు మేలు చేసే కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వానపాములు, నులిపురుగులు నాశనమవుతాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గుతుంది. ఈ వ్యర్థాలను పంటకు మేలు చేసే ఎరువులుగా మార్చే సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 4, 2025

పాక్ దివాలా.. అమ్మకానికి జాతీయ ఎయిర్‌లైన్స్

image

IMF ప్యాకేజీ కోసం తమ జాతీయ ఎయిర్‌లైన్స్‌ను అమ్మడానికి పాకిస్థాన్ సిద్ధమైంది. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(PIA) బిడ్డింగ్ ఈ నెల 23న జరుగుతుందని ఆ దేశ ప్రధాని షరీఫ్ ఓ ప్రకటనలో చెప్పారు. ‘PIAలో 51-100% విక్రయించడం అనేది IMF $7 బిలియన్ల ఆర్థిక ప్యాకేజీ కోసం నిర్దేశించిన షరతులలో భాగం. ఈ సేల్‌కు ఆర్మీ నియంత్రణలోని ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ కూడా ముందస్తు అర్హత సాధించింది’ అని అక్కడి మీడియా చెప్పింది.

News December 4, 2025

ఇతిహాసాలు క్విజ్ – 86

image

ఈరోజు ప్రశ్న: పార్వతీ దేవి అవతారంగా, శక్తి స్వరూపిణిగా, విష్ణుమూర్తి సోదరిగా పరిగణించబడే, ఈశ్వరుడు వివాహం చేసుకున్న దేవత ఎవరు? అలాగే, ఆమెకు తమిళనాడులో ఒక ప్రసిద్ధ ఆలయం కూడా ఉంది. ఆమెతో పాటు ఒక పచ్చ చిలుక కూడా కనిపిస్తుంది.
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం. ☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>