News September 1, 2024
పవన్ కళ్యాణ్ అభిమానులకు క్రేజీ న్యూస్
పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. రేపు పవన్ పుట్టినరోజు సందర్భంగా OG సినిమాలోని ఫస్ట్ సింగిల్, పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. సంబరాలకు రెడీ అవ్వాలని అభిమానులను ఉత్తేజపరిచింది.
Similar News
News February 1, 2025
భారీగా పెరిగిన జీఎస్టీ కలెక్షన్లు
దేశంలో జనవరి నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. 12.3శాతం పెరిగి రూ.1,95,506 కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో దేశీయ లావాదేవీలతో సమకూరిన జీఎస్టీ రూ.1.47 లక్షల కోట్లు కాగా, దిగుమతి వస్తువులపై విధించిన పన్నులతో వచ్చిన ఆదాయం రూ.48,382 కోట్లుగా ఉంది. రీఫండ్స్ కింద రూ.23,853 కోట్లు విడుదల చేయగా, చివరకు వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లుగా ఉన్నాయి.
News February 1, 2025
కొండంత రాగం తీసి కూసంత పాట: షర్మిల
AP: బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్లు ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. 12మంది MPలు ఉన్న నితీశ్‌కు బడ్జెట్‌లో అగ్రతాంబూలం అందుకుంటే, 21మంది MPలతో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబుకు చిప్ప చేతిలో పెట్టారన్నారు. ప్రత్యేకహోదా ప్రస్తావన లేకుండా రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఇంత అన్యాయం జరిగితే CM బడ్జెట్‌ను స్వాగతించడం హాస్యాస్పదమన్నారు.
News February 1, 2025
వసంత పంచమి.. అక్షరాభ్యాసం చేయిస్తున్నారా?
రేపు సరస్వతి దేవికి ఎంతో ప్రీతికరమైన వసంత పంచమి. పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే విద్యా బుద్ధులు వరిస్తాయని భక్తులు నమ్ముతుంటారు. దేశంలో చాలా ప్రసిద్ధ సరస్వతి ఆలయాలున్నాయి. అందులో బాసర (తెలంగాణ) ఒకటి. ఆ తర్వాత శారద పీఠం (కశ్మీర్), శృంగేరి శారదాంబ ఆలయం (కర్ణాటక), సరస్వతి ఆలయం (పుష్కర్- రాజస్థాన్), కూతనూర్ సరస్వతి ఆలయం (తమిళనాడు), విద్యా సరస్వతి ఆలయం (వర్గల్-TG) ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు?