News April 15, 2025
వాట్సాప్ యూజర్లకు క్రేజీ న్యూస్

వాట్సాప్ తమ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లపై దృష్టి పెట్టింది. తాజాగా స్టేటస్ అప్డేట్స్లో వీడియోల డ్యూరేషన్ను పెంచింది. ఇప్పటివరకు 30 సెకండ్ల వ్యవధి ఉన్న వీడియోలను మాత్రమే స్టేటస్ పెట్టుకునే అవకాశం ఉండేది. ఆ సమయాన్ని 90 సెకండ్లకు పెంచింది. ప్రస్తుతం ఈ అప్డేట్ కొంతమంది బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరూ ఉపయోగించుకోవచ్చు.
Similar News
News October 29, 2025
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 110 అప్రెంటిస్‌లు

సంగారెడ్డిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (<
News October 29, 2025
ఇంటి చిట్కాలు

* ఓవెన్‌ని క్లీన్ చేయడానికి ఒక బౌల్లో నిమ్మ ముక్కల్ని వేసి ఓవెన్లో పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత ఒక తడి క్లాత్‌తో ఓవెన్‌ని తుడిస్తే సరిపోతుంది.
* గ్లాస్ ఓవెన్ డోర్‌పై బేకింగ్ సోడా-నీళ్లు కలిపి రాసి పొడి క్లాత్‌తో తుడిస్తే మరకలు వదిలిపోతాయి.
* కిచెన్ సింక్, వాష్‌బేసిన్లపై పడే మరకలపై టూత్‌పేస్ట్ పూసి అరగంట పాటు అలాగే వదిలేయాలి. ఆపై స్పాంజ్‌తో రుద్ది కడిగేస్తే మరకలు సులభంగా వదిలిపోతాయి.
News October 29, 2025
60 మంది డ్రగ్ పెడ్లర్ల కాల్చివేత

2,500మంది బ్రెజిల్ పోలీసులు, జవాన్లు రియోలో డ్రగ్ ట్రాఫికింగ్ గ్యాంగ్‌పై సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. 60మంది అనుమానితులను కాల్చివేశారు. 81 మందిని అరెస్ట్ చేశారు. నలుగురు పోలీసులూ చనిపోయారు. 93 రైఫిల్స్, 500కిలోల డ్రగ్స్ సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో హెలికాప్టర్లు, ఆర్మ్డ్ వెహికల్స్ ఉపయోగించారు. ఈ దాడిని UN హ్యూమన్ రైట్స్ ఆఫీస్ ఖండించింది. విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది.


